Gold Price Today : భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..తులంపై ఏకంగా రూ. 1100 తగ్గింపు..!!

Wed, 07 Aug 2024-5:30 am,

Gold Price Today 7 August 2024: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. నిన్న మొన్నటి వరకు పెరుగుతూ వచ్చిన బంగారం ధర మరోసారి ఊహించని విధంగా పతనం అయ్యింది. బంగారం కొనాలనుకునేవారికి ఇదే మంచి ఛాన్స్ అని చెప్పవచ్చు. ఎందుకుంటే శ్రావణమాసం ప్రారంభమయ్యింది. ఈ మాసంలో శుభకార్యాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బంగారం ధర కూడా తగ్గడంతో ఈ సమయం కొనుగోలు చేయడం బెటర్ అని మార్కెట్ నిపుణులు అంటున్నారు.  

కాగా ఆభరణాల వ్యాపారుల నుండి డిమాండ్ బలహీనంగా ఉండటంతో  స్థానిక బులియన్ మార్కెట్‌లో బంగారం ధర 10 గ్రాములకు రూ.1,100 తగ్గి రూ.71,700కి చేరుకుంది. గత ట్రేడింగ్ సెషన్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.72,800 వద్ద ముగిసింది. వరుసగా నాలుగో సెషన్‌లోనూ వెండి ధరలు తగ్గాయి. ఈరోజు కిలోకు రూ.2,200 తగ్గి రూ.82,000 వద్ద ముగిశాయని ఆల్ ఇండియా బులియన్ అసోసియేషన్ తెలిపింది.   

గత ట్రేడింగ్‌లో కిలో వెండి ధర రూ.84,200 వద్ద ముగిసింది. ఆగస్టు 2న, వెండి ధర కిలోకు రూ. 86,000 వద్ద ట్రేడవుతోంది, ఆ తర్వాత దాని ధర నాలుగు సెషన్లలో కిలోకు రూ.4,200 తగ్గింది. అదే సమయంలో 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.1,100 తగ్గి రూ.71,350కి చేరుకుంది. దీని మునుపటి ముగింపు ధర 10 గ్రాములకు రూ.72,450.  

నగల వ్యాపారులు, రిటైల్ కొనుగోలుదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో బంగారం ధరలు తగ్గాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్‌లోని రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పర్మార్ ప్రకారం, పండుగ సీజన్‌కు ముందు దేశీయంగా బంగారం ధరలకు రూపాయి బలహీనత, భౌతిక డిమాండ్ మద్దతునిస్తుందని భావిస్తున్నారు. ప్రపంచ అనిశ్చితి, సెంట్రల్ బ్యాంక్ డిమాండ్, తక్కువ వడ్డీ రేట్లు బంగారం ధరలకు మంచి సంకేతాలని పర్మార్ చెప్పారు.  

అంతర్జాతీయ మార్కెట్లలో, కామెక్స్‌లో ఔన్స్ బంగారం ధర 20 డాలర్లు తగ్గి 2,409 డాలర్లకు చేరుకుంది. న్యూయార్క్‌లో వెండి కూడా ఔన్స్‌కి 26.94 డాలర్లుగా ట్రేడవుతోంది.దేశీయంగా బంగారం, వెండి ధరల్లో కూడా ఈరోజు తగ్గుదల కనిపించింది. మంగళవారం సాయంత్రం, MCX ఎక్స్ఛేంజీలో 0.51 శాతం లేదా రూ. 354 తగ్గింది.    

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link