Gold Price Today: షాకింగ్ న్యూస్.. రూ.75వేలకు చేరువలో బంగారం, రూ.లక్షకు దగ్గరలో వెండి ధర
Gold Rate Today: బంగారం ధరలు సెప్టెంబర్ 15 ఆదివారం భారీగా పెరిగాయి నేటి ధరలు గమనిస్తే24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర 74,910 రూపాయలు పలుకుతోంది. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర 68,710 రూపాయలు పలుకుతోంది.
బంగారం ధరలు ఈ రేంజ్ లో పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లలో వస్తున్న మార్పులే అని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా చైనాలో విడుదలైన కీలక డేటాలో రిటైల్ అదే విధంగా ఇండస్ట్రియల్ ఆగస్టు గణాంకాలు అంచనాలను అందుకోలేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం వచ్చే సూచనలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.
ఫలితంగా ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే బంగారం వైపు తమ పెట్టుబడులను తరలిస్తున్నారు. దీంతో బంగారం ధర ఆల్ టైం రికార్డ్ స్థాయిని తాకే దిశగా పరుగులు పెడుతోంది. ఇక టు అమెరికా మార్కెట్లో కూడా బంగారం ధర ఒక ఔన్స్ 2650 డాలర్లు దాటింది. దీంతో బంగారం ధరలు అటు అంతర్జాతీయంగా భారీగా పెరిగేందుకు దోహద పడింది.
దీనికి తోడు అటు అమెరికా ఫెడరల్ రిజర్వు సైతం త్వరలోనే కీలక వడ్డీ రేట్లు పావు శాతం మేర తగ్గించే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించింది. దీంతో బంగారం ధరలు ఒక్కసారిగా పెరగడం ప్రారంభించాయి. అమెరికాలో కీలక వడ్డీరేట్లు తగ్గించినట్లయితే అమెరికా చేసి జారీ చేసిన ట్రెజరీ బాండ్ల పై వచ్చే రాబడి విలువ కూడా తగ్గిపోతుంది.
దీంతో ఇన్వెస్టర్లు ట్రెజరీ బాండ్ల నుంచి తమ పెట్టుబడులను బంగారం వైపు తరలించే అవకాశం ఉంటుంది దీనికి తోడు అమెరికా డాలర్ విలువ కూడా 9 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది ఈ పరిణామం కూడా బంగారం ధర పెరగడానికి దోహదపడుతుంది. ప్రస్తుతం దేశీయంగా బంగారం ధర ఆల్ టైం గరిష్ట స్థాయి అయినా 75 వేల సమీపానికి చేరింది.
ట్రెండు ఇలాగే కొనసాగినట్లయితే బంగారం ధర తీరలోనే ఫెస్టివల్ సీజన్ నాటికి అంటే దసరా దీపావళి ధన త్రయోదశి సందర్భంగా 80 వేల రూపాయలు వెళ్లే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. దీనికి తోడు అమెరికా అధ్యక్ష ఎన్నికలు కూడా జరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉంటుంది ఇదే జరిగితే ఈ సంవత్సరం చివరి నాటికి బంగారం ధర 90 వేల నుంచి 1 లక్ష రూపాయలు మధ్యలో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంటుంది.
బంగారం ధరలు భారీగా పెరగడంతో అటు పసిడి ప్రియులు గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా ఆభరణాల దుకాణదారులు తమ సేల్స్ తగ్గుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే బంగారం కొనుగోలు చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా ఈ సందర్భంగా నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే ఆల్ టైం గరిష్ట స్థాయి దాటిన తర్వాత బంగారం చాలా విలువైన లోహంగా మారుతుంది.
ఇలాంటి సమయంలో మీరు ఆభరణాలు కొనుగోలు చేసే సమయంలో ఏ మాత్రం పొరపాటు జరిగినా పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా బంగారం తూకం విషయంలో ఒక్క గ్రాము తేడా వచ్చిన వేళలో నష్టపోయే ప్రమాదం ఉంటుంది. మరోవైపు నాణ్యత విషయంలో కూడా జాగ్రత్త గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. హాల్ మార్కు ఉన్న బంగారాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం హాల్ మార్క్ బంగారం విక్రయించడం తప్పనిసరి చేసింది.