Gold News: అమాంతం రూ.15000 పెరిగిన తులం బంగారం ధర.. ఇక లక్ష దాటడం ఖాయం..!!
Gold Rate News: బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఒక కారణంగా చెప్తున్నారు. పశ్చిమసియా దేశాల్లో పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణం ఉన్న కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాణిజ్యం కుంటుపడే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ఎగుమతులు దిగుమతులు పై ఇది ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. దీంతో పసిడి ధరలు భారీగా పెరుగుతున్నాయి.
దీనికి తోడు అమెరికాలో 31 గ్రాముల మేలిమి బంగారం ధర 2739 డాలర్ల రూపాయలు పలుకుతోంది. అలాగే అమెరికా డాలర్ విలువ 84 రూపాయలు దాటింది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి.
ప్రధానంగా పశ్చిమ దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని ముందు నుంచి కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు.
అందుకు తగ్గట్టుగానే బంగారం ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. దీనికి తోడు మన దేశీయంగా కూడా బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా ధన త్రయోదశి దీపావళి పండుగలు ముందు ఉండటమే కారణం అని చెప్పవచ్చు.
ఈ పండగల కారణంగా పెద్ద ఎత్తున దినం బంగారం కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో పసిడి ధరలు భారీగా పెరుగుతున్నాయి.
బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పసిడి ఆభరణాలు కొనుగోలు చేసేందుకు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా బంగారం బరువు విషయంలోనూ నాణ్యత విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక మిల్లీగ్రామ్ తేడా వచ్చినా మీరు పెద్ద మొత్తంలో నష్టపోయే ప్రమాదం ఉంది.
అందుకే కేవలం హాల్ మార్క్ ఉన్న బంగారం మాత్రమే కొనుగోలు చేయాలి. లేకపోతే వినియోగదారుల హక్కుల ఫోరంలో మీరు కంప్లైంట్ చేయవచ్చు కేంద్ర ప్రభుత్వం కేవలం హాల్ మార్కు బంగారాన్ని మాత్రమే విక్రయించాలని ఇప్పటికే బంగారు ఆభరణాల వ్యాపారులకు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆర్డర్ పాస్ చేసింది. ఈ నేపథ్యంలో మీరు బంగారం కొనుగోలు చేసే సమయంలో కేవలం హాల్ మార్క్ ఉన్న బంగారం మాత్రమే కొనుగోలు చేయాలి.