Gold Price In Hyderabad 07 July 2021: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు, భారీగా పతనమైన వెండి ధరలు

Wed, 07 Jul 2021-10:56 am,

Gold Rate in Hyderabad: కరోనా సెకండ్ వేవ్ ప్రభావం దాదాపుగా తగ్గడంతో బులియన్ మార్కెట్ సహా పలు ఇతర రంగాలు కోలుకుంటున్నాయి. ఏపీ, తెలంగానలో తాజాగా బంగారం ధరలు పుంజుకున్నాయి. అయితే పసిడికి భిన్నంగా వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. దేశ రాజధానిలో బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి.

Also Read: Samsung Galaxy F22 Price In India: భారత మార్కెట్లోకి శాంసంగ్ గెలాక్సీ ఎఫ్22 విడుదల

Gold Price Today In Hyderabad 07 July 2021: కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గడంతో బులియన్ మార్కెట్ మళ్లీ గాడిన పడుతోంది. తెలుగు రాష్ట్రాల మార్కెట్లలో బంగారం ధర పెరిగింది. రూ.270 మేర పెరగడంతో హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,710కి చేరుకుంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,650 అయింది.

ఏపీ, తెలంగాణలో బంగారం ధరలు స్వల్పంగా పెరగగా ఢిల్లీలో పసిడి ధరలు నిలకడగా ఉన్నాయి. నేడు ఢిల్లీలో స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.50,560 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,560 అయింది.

Also Read: SBI Home Loan Interest: ఎస్‌బీఐ హోమ్ లోన్ ఇంటరెస్ట్ సర్టిఫికెట్ కావాలా, ఎంచక్కా SBI Onlineలో పొందవచ్చు

దేశ రాజధానిలో వెండి ధర రూ.70 వేల మార్కు కిందకి దిగొచ్చింది. తాజాగా ఢిల్లీలో వెండి రూ.1000 మేర పతనం కావడంతో నేడు 1 కేజీ వెండి రూ.69,600కు దిగొచ్చింది. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో రూ.1,100 మేర భారీగ తగ్గడంతో 1 కేజీ వెండి ధర రూ.74,100కు పడిపోయింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link