Gold Price In Hyderabad 14th July 2021: మార్కెట్లో పసిడి ధరల జోరు, భారీగా పతనమైన వెండి ధరలు

Wed, 14 Jul 2021-1:00 pm,

Gold Rate Update 14th July 2021: దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో  బంగారం ధర ఓ మోస్తరుగా పెరిగింది. ఏపీ, తెలంగాణలోనూ బంగారం ధర వరుసగా రెండోరోజు స్వల్పంగా పెరిగింది. పసిడికి భిన్నంగా వెండి ధరలున్నాయి. తెలుగు రాష్ట్రాల మార్కెట్లలో వెండి ధరలు భారీగా పతనం కాగా, ఢిల్లీలో స్వల్పంగా తగ్గాయి.

Also Read: SBI Doorstep Banking Service: కరోనా నేపథ్యంలో ఖాతాదారులకు ఎస్‌బీఐ డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సౌకర్యం, అర్హత, ఛార్జీల పూర్తి వివరాలు

నేడు బంగారం ధరలు వరుసగా రెండోరోజు స్వల్పంగా పెరిగాయి. తాజాగా హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో రూ.110 చొప్పున పుంజుకుంది. నేడు హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,990 అయింది. 22 క్యారెట్ల సైతం ధర పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.44,900 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

ఏపీ, తెలంగాణలో బంగారం ధరలు గాడిన పడుతున్నాయి. ఢిల్లీ మార్కెట్లోనూ పసిడి ధరలు ఓ మోస్తరుగా పెరిగాయి. రూ.350 మేర పెరగడంతో ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,210కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,960 వద్ద మార్కెట్ అవుతోంది.

Also Read: BMW R 1250 GS Price: బీఎండబ్ల్యూ కంపెనీ నుంచి 2 స్పోర్ట్స్ బైక్స్‌, ధర చూస్తే షాక్

బులియన్ మార్కెట్లో నిన్న పెరిగిన వెండి ధర నేడు దిగొచ్చింది. ఢిల్లీలో వెండి ధర రూ.200 మేర స్వల్పంగా తగ్గడంతో నేడు 1 కేజీ వెండి రూ.69,200కు పతనమైంది. ఏపీ, తెలంగాణ మార్కెట్లలో వెండి రూ.5,200 మేర భారీగా క్షీణించింది. నేడు హైదరాబాద్, విజయవాడలో 1 కేజీ వెండి ధర రూ.69,200కు పతనమైంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link