Gold Price Today 01 April 2021: గుడ్ న్యూస్, మళ్లీ పతనమైన బంగారం ధరలు, వెండి ధరలు

Thu, 01 Apr 2021-8:30 am,

Gold Price Today 01 April 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి దిగొచ్చాయి. తాజాగా బంగారం ధరలు స్వల్పంగా పడిపోగా, వెండి ధరలు సైతం పసిడి దారిలోనే పయనిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో వెండి ధర పతనం కాగా, ఢిల్లీలోనూ వెండి ధర దిగొచ్చింది.

Also Read: Your take home salary: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వేజ్ కోడ్ ప్రస్తుతానికి లేనట్టేనా ?

తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ (Gold Price In Hyderabad) మార్కెట్లలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.270 మేర దిగిరావడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.44,840 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.41,100కి పడిపోయింది.

Also Read: ITR Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త చట్టాలు, కొత్త నియమాలు ఇవే, ఎవరిపై ప్రభావం

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు మళ్లీ దిగొచ్చాయి. దీంతో నేడు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,180కి పతనమైంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,250కి పడిపోయింది.

బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. వెండి ధర రూ.700 మేర భారీగా పతనం కావడంతో తాజాగా 1 కేజీ వెండి ధర రూ.63,200 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.1,200 మేర భారీగా క్షీణించింది. తాజాగా హైదరాబాద్ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.67,300కి దిగొచ్చింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link