Gold Price Today In Hyderabad 02 June 2021: వరుసగా మూడోరోజు బంగారం ధర జిగేల్, మిశ్రమంగా వెండి ధరలు

Wed, 02 Jun 2021-9:23 am,

Gold Rate Today 02 June 2021:  కరోనా సెకండ్ వేవ్‌లోనూ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా మూడో రోజు పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాలలో బంగారం ధర పెరగగా, దేశ రాజధాని ఢిల్లీలో పతనమైంది. తెలుగు రాష్ట్రాలలో వెండి ధర పుంజుకోగా, ఢిల్లీలో దిగొచ్చింది. నేటి బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..

Also Read: SBI Cash Withdrawal Rules: క్యాష్ విత్‌డ్రా పరిమితి పెంచిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

Gold Rate Today In Hyderabad: విజయవాడ, హైదరాబాద్‌ మార్కెట్లలో బంగారం ధర వరుసగా మూడో రోజు పెరిగింది. తాజాగా రూ.230 మేర పెరగడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.50,300కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,100 వద్ద ట్రేడింగ్ జరుగుతోంది.

Also Read: Best Pension Plans: బెస్ట్ పెన్షన్, సేవింగ్స్ ప్లాన్ కావాలంటే ఈ వివరాలు చదవండి

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.110 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.50,990కు చేరుకుంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,990 అయింది.

ఢిల్లీ మార్కెట్‌లో వెండి ధర రెండు రోజుల తరువాత స్వల్పంగా దిగొచ్చింది. నేడు దేశ రాజధానిలో వెండి ధర రూ.300 మేర దిగిరావడంతో 1 కేజీ వెండి ధర రూ.72,300కు క్షీణించింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర స్వల్పంగా పెరిగింది. విజయవాడలో రూ.200 మేర పెరగడంతో 1 కేజీ వెండి ధర రూ.77,500కు చేరుకుంది. హైదరాబాద్‌లో రూ.700 మేర వెండి ధర పుంజుకుంది. తాజాగా 1 కేజీ ధర రూ.77,500 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link