SBI Cash Withdrawal Rules: క్యాష్ విత్‌డ్రా పరిమితి పెంచిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

  కరోనా కష్టకాలంలో నగదు విత్‌డ్రా సమస్యలు ఎదుర్కొంటున్న వారికి కొన్ని పరిష్కారాలు సూచించింది. ఈ మేరకు ఎస్‌బీఐలో తమకు అకౌంట్ ఉన్న బ్రాంచులలో కాకుండా ఇతర బ్రాంచ్ బ్యాంకులలో నగదు ఉపసంహరణ (SBI Cash Withdraw) పరిమితి పెంచుతూ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. 

SBI Cash Withdrawal Limit At Non-Home Branches:  కరోనా కష్టకాలంలో నగదు విత్‌డ్రా సమస్యలు ఎదుర్కొంటున్న వారికి కొన్ని పరిష్కారాలు సూచించింది. ఈ మేరకు ఎస్‌బీఐలో తమకు అకౌంట్ ఉన్న బ్రాంచులలో కాకుండా ఇతర బ్రాంచ్ బ్యాంకులలో నగదు ఉపసంహరణ (SBI Cash Withdraw) పరిమితి పెంచుతూ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. 

1 /5

SBI Cash Withdrawal Rules : దేశీయ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ (State Bank Of India) తన ఖాతాదారులకు శుభవార్త అందించింది. కరోనా కష్టకాలంలో నగదు విత్‌డ్రా సమస్యలు ఎదుర్కొంటున్న వారికి కొన్ని పరిష్కారాలు సూచించింది. ఈ మేరకు ఎస్‌బీఐలో తమకు అకౌంట్ ఉన్న బ్రాంచులలో కాకుండా ఇతర బ్రాంచ్ బ్యాంకులలో నగదు ఉపసంహరణ (SBI Cash Withdraw) పరిమితి పెంచుతూ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.  Also Read: Google Photos Fee Storage: గూగుల్ ఫొటోస్, వీడియోస్ స్టోరేజీకి ఇకనుంచి డబ్బులు చెల్లించాలా, ఇది చదవండి

2 /5

SBI Non-Home Branchesలో క్యాష్ విత్‌డ్రా కోసం సవరించిన నియమాలు ఇవే.. 1. ఎస్‌బీఐ నాన్ హోమ్ బ్రాంచ్‌ (మీకు ఖాతాలేని ఇతర ఎస్‌బీఐ బ్యాంకు)లలో క్యాష్ విత్‌డ్రా ఫామ్ ద్వారా సేవింగ్స్ ఖాతా నుంచి పాస్‌బుక్ చూపించి రూ.25 వేలు నగదు ఉపసంహరించుకోవచ్చు. 2. క్యాష్ విత్‌డ్రాయల్ ఫర్ సెల్ఫ్ చెక్ ద్వారా ఎస్‌బీఐ ఇతర బ్రాంచ్ బ్యాంకులలో మీరు రూ.1 లక్ష విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. 3. థర్డ్ పార్టీ (ఇతరులకు జారీ చేసిన చెక్) ద్వారా రూ.50,000 వరకు నగదు ఉపసంహరించడానికి అనుమతి ఇచ్చింది.  (Photo: Twitter/@TheOfficialSBI)

3 /5

SBI Cash Withdrawal Rules : కరోనా సెకండ్ వేవ్ సమయంలో తమ ఖాతాదారులు నగదు కోసం ఇబ్బంది పడకూడదని, తమకు అందుబాటులో ఉన్న ఎస్‌బీఐ బ్రాంచ్ బ్యాంకుల నుంచి నగదును విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. అయితే సవరించిన కొత్త నియమాలు సెప్టెంబర్ 30, 2021 వరకు అమలులో ఉంటాయని శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. Also Read: Best Pension Plans: బెస్ట్ పెన్షన్, సేవింగ్స్ ప్లాన్ కావాలంటే ఈ వివరాలు చదవండి

4 /5

థర్డ్ పార్టీ (ఇతరులు) క్యాష్ విత్‌డ్రా ఫామ్ సమర్పించడం ద్వారా నగదును ఉపసంహరించుకోవడం వీలుకాదని భారతీయ స్టేట్ బ్యాంక్ తన తాజా నియమాలలో స్పష్టం చేసింది. మరోవైపు థర్డ్ పార్టీ వారు చెక్ తీసుకొచ్చినా, ఇతరత్రా పనులకు ఎస్‌బీఐకి వచ్చినా తమ KYC సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది.  Also Read: SBI Mobile Number Change: బ్యాంకుకు వెళ్లకుండా ఎస్‌బీఐ మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోండ

5 /5

SBI Cash Withdrawal Rules : ప్రస్తుతం లాక్‌డౌన్, కర్ఫ్యూ సమయంలో ఎస్‌బీఐ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సేవలు అందిస్తోంది. కేవలం 50 శాతం సిబ్బంది భారతీయ స్టేట్ బ్యాంకు పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో తమ ఖాతాదారులకు కరోనా వ్యాప్తి చెందకుండా చూడటంలో భాగంగా సమీపంలోని ఏదైనా ఇతర ఎస్‌బీ బ్యాంకులలో నగదు ఉపసంహరణ పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook