Gold Price Today 16 April 2021: భారీగా పెరిగిన బంగారం ధరలు, ఆకాశన్నంటుతున్న వెండి ధరలు

Fri, 16 Apr 2021-10:51 am,

Gold Price Today 16 April 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు పెరిగాయి. తాజాగా బంగారం ధరలు పుంజుకోగా, వెండి ధరలు సైతం పసిడి బాటలోనే భారీ ధరలు నమోదు చేశాయి. తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు పెరగగా, ఢిల్లీలోనూ పసిడి ధరలకు రెక్కలొచ్చాయి. హైదరాబాద్ మార్కెట్‌, ఢిల్లీ మార్కెట్‌లో వెండి ధరలు ఆకాన్నంటుతున్నాయి.

Gold Price In Hyderabad : తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ మార్కెట్లలో బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. తాజాగా రూ.330 మేర పెరగడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.48,00కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,000 అయింది.

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. తాజాగా బంగారం ధర రూ.100 మేర తగ్గింది. దీంతో నేడు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,020కి క్షీణించింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,850కి దిగొచ్చింది.

బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు భారీగా పెరిగాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధర రూ.700 మేర ఎగసింది. నేడు ఢిల్లీలో 1 కేజీ వెండి ధర రూ.68,500 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర పుంజుకుంది. హైదరాబాద్ మార్కెట్‌లో వెండి ధర రూ.1,500 మేర పెరగడంతో 1 కేజీ ధర రూ.73,400కు చేరింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link