Gold Price Today In Hyderabad: బులియన్ మార్కెట్‌లో దిగొచ్చిన బంగారం ధరలు, పసిడి దారిలోనే Silver Price
Gold Price Today 18 February 2021: బులియన్ మార్కెట్‌లో గత నాలుగు రోజులుగా స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు తాజాగా దిగొస్తున్నాయి. కాగా నేడు వెండి ధరలు సైతం పసిడి దారిలోనే పయనిస్తూ పతనమమయ్యాయి.
Also Read: EPFO Alert: ఈపీఎఫ్ వడ్డీ రావాలంటే 40 లక్షల మంది ఖాతాదారులు ఇలా చేస్తే సరి
విజయవాడ, హైదరాబాద్ (Hyderabad)లలో నాలుగో రోజు స్థిరంగా ఉన్న బంగారం ధర తాజాగా రూ.560 మేర దిగొచ్చింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.47,730 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారం ధర రూ.43,750కి పతనమైంది.
Also Read: Post Office ఈ మంత్లీ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయండి, ఇక ప్రతినెలా రూ.4,950 పొందండి
ఢిల్లీలో గత నాలుగు రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు తాజాగా పతనమయ్యాయి. తాజాగా రూ.550 మేర దిగిరావడంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,070 అయింది. అదే సమయంలో 22 క్యారెట్లపై 10 గ్రాముల బంగారం ధర రూ.45,900కి క్షీణించింది.
Also Read: ఫాస్టాగ్ వాడకం తప్పనిసరి, దీని ఉపయోగం ఏమిటి
బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు సైతం బంగారం దారిలోనే పయనించాయి. తాజాగా వెండి ధర రూ.600 మేర తగ్గింది. దీంతో 1 కేజీ వెండి ధర రూ.69,600 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.1,400 మేర దిగొచ్చింది. దీంతో 1 కేజీ వెండి ధర రూ.73,600కు పడిపోయింది.