Post Office ఈ మంత్లీ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయండి, ఇక ప్రతినెలా రూ.4,950 పొందండి

పోస్టాఫీసు అందిస్తున్న చిన్న మొత్తాల పొదుపు పథకాలు మీకు అధిక రాబడిని ఇస్తాయి. మరియు హామీ ఇచ్చే రిటర్న్ పథకాలపై పెట్టుబడి ద్వారా నెలవారీ ఆదాయ పథకం పొందవచ్చు.

1 /5

పోస్టాఫీసు(Post Office) చిన్న మొత్తాలలో పొదుపు పథకాలు మంచి రాబడిని ఇస్తాయి.  రూ.1000 నుంచి పోస్టాఫీసులో సేవింగ్స్ స్కీమ్ పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్టంగా సింగిల్ ఖాతాలో రూ.4.5 లక్షలు, ఉమ్మడి ఖాతా(Post Office Joint Account)లో రూ.9 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే ఒక్క వ్యక్తి రూ.4.5 లక్షలు ఉండే జాయింట్ అకౌంట్ మొత్తం వాటా రూ.9 లక్షలు అవుతుంది. Also Read: Postal Life Insurance Benefits: పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ చేస్తే కలిగే ప్రయోజనాలివే

2 /5

ఏప్రిల్ 1, 2020 నుండి పోస్టాఫీసు నెలవారీ ఆదాయం అందించే స్కీమ్‌లకు 6.6 శాతం వడ్డీ రేట్లు అందిస్తోంది. మీరు సింగిల్ అకౌంట్ హోల్డర్ అయితే పోస్టాఫీసు Monthly Income Scheme(MIS) పథకంలో రూ .4.5 లక్షలు పెట్టుబడి పెట్టుబడి ద్వారా మీరు ఏడాదికి రూ .29,700 వార్షిక వడ్డీని పొందుతారు.  Also Read: Digital Life Certificate: పెన్షనర్లకు గుడ్ న్యూస్.. సరికొత్త సర్వీసు ప్రారంభం

3 /5

ఉమ్మడి ఖాతాదారుల(Post Office Joint Account)కు 9 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టడం ద్వారా వార్షికంగా రూ. 59,400 వడ్డీ అందిస్తుంది. అంటే రూ.4,950 నెలవారీ ఆదాయం పోస్టాఫీసు నుంచి లభిస్తుంది. Also Read: Post Office ఖాతాదారులకు షాక్..ఇలా చేయకపోతే ఎకౌంట్ క్లోజ్

4 /5

ప్రారంభించిన తేదీ నుండి సరిగ్గా ఒక నెల పూర్తయిన తర్వాత నుంచి మెచ్యూరిటీ వరకు ప్రతినెలా మీకు వడ్డీ చెల్లిస్తుంది. ప్రతి నెల వడ్డీని ఖాతాదారుడు క్లెయిమ్ చేయకపోతే, అదనపు వడ్డీని అందించదు. 

5 /5

పోస్టాఫీస్ నెలవారీ ఆదాయం పథకాన్ని వయోజన వ్యక్తి కానీ, జాయింట్ అకౌంట్ (3 పెద్దలు వరకు), మైనర్ / అతడి తరపున ఓ సంరక్షకుడు పేరిట ఇలా 3 రకాల అకౌంట్లు తెరిచి ఆదాయాన్ని పొందచ్చు. ఆటో క్రెడిట్ ద్వారా వడ్డీని పోస్టాఫీసు పొదుపు ఖాతాలోకి జమ చేస్తారు. Also Read: Post Office: పోస్టాఫిస్ ఖాతా తెరవాలి అనుకుంటున్నారా? ముందు ఇది చదవండి!