Gold Price Today In Hyderabad: గుడ్ న్యూస్.. మళ్లీ పతనమైన బంగారం ధర, మిశ్రమంగా వెండి ధరలు

Wed, 24 Mar 2021-10:46 am,

Gold Price Today 24 March 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా రెండోరోజు దిగొచ్చాయి. బులియన్ మార్కెట్‌లో తాజాగా బంగారం ధరలతో పాటు వెండి ధర పతనమయ్యాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ పసిడి ధరలు దిగిరాగా వెండి ధరలు సైతం బంగారం బాటలో పయనిస్తున్నాయి.

Also Read: SBI Alert: ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే ఎస్‌బీఐ రూ.2 లక్షల ఇన్సూరెన్స్

తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ (Gold Price In Hyderabad) మార్కెట్లలో బంగారం ధర రెండోరోజు స్వల్పంగా తగ్గింది. తాజాగా రూ.180 మేర దిగొచ్చింది. దీంతో నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.45,700 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.41,900 అయింది.

Also Read: 7th Pay Commission: హోలీకి ముందే స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ

దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా రెండోరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. తాజాగా రూ.170 మేర బంగారం ధర దిగొచ్చింది. దీంతో నేడు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,050 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,050కి క్షీణించింది.

Also Read: EPFO: తెరపైకి కొత్త వేతన కోడ్, EPFతో పాటు జీతాల్లో ఏప్రిల్ 1 నుంచి మార్పులు

బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు వరుసగా రెండోరోజు దిగొచ్చాయి. వెండి ధర రూ.600 మేర భారీగా దిగిరావడంతో తాజాగా 1 కేజీ వెండి ధర రూ.66,000 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర స్వల్పంగా పెరిగింది. తాజాగా హైదరాబాద్, విజయవాడ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.70,400కి చేరింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link