Gold Price Today 10th Jan 2021: భారీగా దిగొచ్చిన బంగారం ధర.. రూ.6వేలు తగ్గిన వెండి ధర

Sat, 23 Jan 2021-9:28 am,

ఇటీవల భారీగా పెరిగిన బంగారం ధరలు(Gold Price Today) తాజాగా పతనమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు క్షీణించాయి. వెండి ధర ఏకంగా రూ.6000 మేర దిగి రావడం గమనార్హం.

Gold Price Today in Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ, హైదరాబాద్‌ (Hyderabad)లలో బంగారం ధర 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,300 మేర భారీగా దిగొచ్చింది. దీంతో 10 గ్రాముల పసిడి ధర రూ.50,500కి పతనమైంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,300 వద్ద మార్కెట్ అవుతోంది.

Also Read: Lowest Interest Rate: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి

దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా మూడో రోజు బంగారం ధర దిగొచ్చింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,310 మేర భారీగా తగ్గింది. దీంతో 10 గ్రాముల ధర రూ.52,850 అయింది. అదే సమయంలో 22 క్యారెట్లపై రూ.1,200 తగ్గడంతో బంగారం ధర 10 గ్రాములకు రూ.48,450కి పతనమైంది.

Also Read: Cheapest Data Plans: ఎయిర్‌టెల్, జియో, బీఎస్ఎన్ఎల్ మరియు విఐ బెస్ట్ ప్లాన్స్ ఇవే..

ఢిల్లీలో వెండి ధర ఏకంగా రూ.6,000 మేర భారీగా పతనమైంది. నేడు 1 కేజీ వెండి ధర రూ.63,900కు దిగొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.5,500 మేర భారీగా తగ్గింది. ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర రూ.69,000 అయింది.

Also Read: EPFO శుభవార్త.. మీ PF రెట్టింపు చేసుకోండి.. మరెన్నో లాభాలు!

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link