Gold Price Today 12 Jan 2021: మళ్లీ పతనమైన బంగారం ధర.. వెండి ధర పైపైకి
Gold Price Today: ఇటీవల భారీగా పెరిగిన బంగారం ధరలు(Gold Price Today) తాజాగా దిగొస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు క్షీణించాయి. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి సమయం నుంచి దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.
Gold Rate Today in Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ, హైదరాబాద్ (Hyderabad)లలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.440 మేర దిగొచ్చింది. దీంతో 10 గ్రాముల ధర రూ.50,070కి పతనమైంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,900 వద్ద మార్కెట్ అవుతోంది.
Also Read: EPF Interest Rate: ఈపీఎఫ్ వడ్డీ ఖాతాకు రాలేదా.. ఇలా ఫిర్యాదు చేయండి
Gold Price Today In Delhi: దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా రెండో రోజు బంగారం ధర పతనమైంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.440 మేర తగ్గింది. దీంతో 10 గ్రాముల ధర రూ.52,420 అయింది. అదే సమయంలో 22 క్యారెట్లపై రూ.410 తగ్గడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.48,050కు క్షీణించింది.
Silver Price Today in India: దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధర ఏకంగా రూ.900 మేర భారీగా పెరిగింది. నేడు 1 కేజీ వెండి ధర రూ.64,800 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.600 మేర పెరిగింది. ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర రూ.69,600కు చేరింది.
Also Read: Lowest Interest Rate: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి