Gold Price Today 13th January 2021: మళ్లీ పుంజుకున్న బంగారం ధరలు.. వెండి ధర పరుగులు!
Gold Price Today 13th January 2021: నూతన సంవత్సరంలో బులియన్ మార్కెట్‌లో జోష్ కనిపిస్తోంది. బంగారం ధరలు(Gold Price Today) భారీగా పుంజుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు పెరిగాయి.
తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ, హైదరాబాద్ (Hyderabad)లలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.330 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల ధర రూ.50,400కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.300 పెరగడంతో 10 గ్రాముల ధర రూ.46,200 అయింది.
Also Read: Ammavodi Status: జగనన్న అమ్మ ఒడి స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల ధర రూ.52,750 అయింది. అదే సమయంలో 22 క్యారెట్లపై రూ.300 పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.48,350కి చేరింది.
దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధర ఏకంగా రూ.1000 మేర భారీగా పెరిగింది. నేడు 1 కేజీ వెండి ధర రూ.65,800 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.800 మేర పెరిగింది. ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర రూ.70,400కు చేరింది.
Also Read: Lowest Interest Rate: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి