Gold Price Today 18th January 2021: మళ్లీ పతనమైన బంగారం ధరలు.. 4 రోజుల్లో రూ.6 వేలు దిగొచ్చిన వెండి
బులియన్ మార్కెట్‌లో నూతన సంవత్సరంలో తొలి వారం భారీగా పెరిగిన బంగారం ధరలు(Gold Price Today) తాజాగా దిగొస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలతో పాటు వెండి ధరలు భారీగా పతనమయ్యాయి.
తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ, హైదరాబాద్(Hyderabad)లలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.550 మేర తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.49,630కి పతనమైంది. అదే సమయంలో 22 క్యారెట్లపై రూ.500 మేర క్షీణించడంతో 10 బంగారం గ్రాముల ధర రూ.45,490 అయింది.
Also Read: WhatsApp Privacy Policy: ప్రైవసీ పాలసీపై వెనక్కి తగ్గిన వాట్సాప్
దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు రూ.1,010 మేర భారీగా తగ్గింది. దీంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,500కి పనతమైంది. అదే సమయంలో 22 క్యారెట్లపై 10 గ్రాముల బంగారం ధర రూ.48,130గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర గత 4 రోజుల్లో రూ.6000 మేర పతనమైంది. తాజాగా రూ.4,700 మేర తగ్గింది. ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర రూ.65,000కు పతనమైంది. దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధర రూ.1,600 మేర తగ్గింది. నేడు 1 కేజీ వెండి ధర రూ.65,000 వద్ద మార్కెట్ అవుతోంది.
Also Read: 7th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త.. త్వరలో కీలక ప్రకటన