Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. వెండి ధరల జోరు
Gold Price Today 22nd January 2021: బులియన్ మార్కెట్‌లో జనవరి రెండో వారంలో తగ్గిన బంగారం, వెండి ధరలు తాజాగా పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు(Gold Price Today), వెండి ధరలు పెరిగాయి. నమోదయ్యాయి.
Also Read: PM Kisan Samman Nidhi: రైతులకు సాయం రూ.10,000కు పెంపు.. బడ్జెట్‌లో ప్రకటన!
తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్ (Hyderabad)లలో బంగారం ధర రూ.490 మేర పెరిగింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములకు రూ.50,450 అయింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250 అయింది.
దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు రూ.540 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,800 అయింది. అదే సమయంలో 22 క్యారెట్లపై రూ.490 పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.48,400కి చేరింది.
Also Read: PPF: ఈ తేదీలోగా నగదు జమ చేస్తేనే వడ్డీ, ప్రయోజనాలు
ఢిల్లీలో వెండి ధర రూ.1,200 మేర భారీగా పెరిగింది. నేడు 1 కేజీ వెండి ధర రూ.67,700 అయింది. తెలుగు రాష్ట్రాల్లోనూ వెండి ధర రూ.1,200 మేర పుంజుకుంది. ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర రూ.72,500కు చేరింది.
Also Read: PPO: కేంద్రం శుభవార్త.. పెన్షన్ కోసం ఇక ఆ సమస్య ఉండదు