Gold News: నేటి బంగారం ధరలు చూస్తే నిద్రపట్టదిక..తులం కాదు 10 తులాలు కొనేస్తరేమో

Tue, 03 Dec 2024-4:23 pm,

Gold News: బంగారం ప్రియులకు శుభవార్త. ఎందుకంటే బంగారం ధర మళ్లీ తగ్గుముఖం పడుతున్నాయి. దేశీయం, ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ పసిడి ధరలు పతనమయ్యాయి. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2636 డాలర్ల దగ్గర కొనసాగుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు 30.60 డాలర్లదగ్గర కదులుతోంది.

ఇదే సమయంలో డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 84.70 దగ్గర ఉంది. ఇది ఆల్ టైమ్ కనిష్ట స్థాయి అని చెప్పుకోవచ్చు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గుతున్న నేపథ్యంలో దేశీయంగా కూడా పసిడి ధరలు భారీగా పడిపోతున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ , ఢిల్లీ వంటి చోట్ల బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 

హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర ఒక్కరోజే రూ. 600 తగ్గింది. దీంతో ఇప్పుడు తులం బంగారం ధర రూ. 70,900 వద్ద ఉంది. దీనికి ముందు రోజు మాత్రం బంగారం ధర స్థిరంగానే ఉంది. ఇదే సమయంలో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర హైదరాబాద్ లో 650 పతనమై ప్రస్తుతం పది గ్రాములకు 77,350 దగ్గర ఉంది. 

దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు దిగివచ్చాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ. 600 పతనంతో ప్రస్తుతం రూ. 71,050 వద్ద ఉంది. ఇక 24క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ. 650 దిగివచ్చింది. ఇప్పుడు పది గ్రాముల బంగారం ధర రూ. 77,500 ఉంది. 

బంగారం ధర బాటలోనే వెండి రేట్లు కూడా భారీగానే పడిపోతున్నాయి.ఢిల్లీలో వెండి ధర రూ. 500 తగ్గింది. ప్రస్తుతం కిలోకు రూ. 91 వేల మార్కు వద్ద ఉంది. హైదరాబాద్ నగరంలో చూస్తే రూ. 500 పతనంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 99,500 దగ్గర ఉంది. 

బంగారం, వెండి ధరలు ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. స్థానిక పన్ను రేట్లు సహా ఇతర అంశాలు దోహదం చేస్తాయి. అందుకే బంగారం, వెండి వంటివి కొనేముందు ఒకటిరెండు సార్లు చెక్ చేసుకోవడం మంచిది.   

ఇక బంగారం ధర భవిష్యత్తులో భారీగానే తగ్గుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. జనవరి 20వ తేదీన ట్రంప్ అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత బంగారం ధరల్లో భారీగా మార్పులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link