Gold Prices: గుడ్ న్యూస్ అంటే ఇది కదా.. మరింత కుప్పకూలబోతున్న బంగారం ధర.. త్వరలోనే తులం ధర రూ. 60వేల దిగువకు
Gold Prices: బంగారం కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా. అయితే మీకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే బంగారం ధర మరింత పడిపోయే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఇంకా దిగి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
మార్కెట్లో అమ్మకందారుల ఆధిపత్యం కారణంతో హైదరాబాద్ తోపాటు ఇతర నగరాల్లో బంగారం ధరలు సమీప భవిష్యత్తులో మరింత తగ్గే ఛాన్స్ ఉంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం..పసిడి ధర పెరుగుదలకు తక్షణ సానుకూల అంశాలు కనిపించట్లేదు. బంగారం ధరల్లో ప్రస్తుతం తగ్గుదల ఇంకా పూర్తి కాలేదు. రానున్న కాలంలో బంగారం ధరలు ఇంకా తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు.
నవంబర్ 7వ తేదీ నుంచి హైదరాబాద్ లో బంగారం ధరలు 22 క్యారెట్ల బంగారంపై రూ. 4,200, 24 క్యారెట్ల పసిడిపై రూ. 4,590 మేర తగ్గింది. ఇది సానుకూల అంశమని చెప్పవచ్చు.
ద్రవ్యోల్బణం 2శాతం లక్ష్యాన్ని చేరుకోవడంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల కోత కొనసాగుతోంది. తాజా వినియోగిదారుల ధరల సూచిన డేటా ఆందోళనను లేవనెత్తింది. ఊహించిన విధంగానే 2.4శాతంతో పోల్చితే సీపీఐ ఊహించిన దానికంటే 2.6శాతం అధిక స్థాయిని చూపించింది.
ఈ పరిణామం బంగారం ధరలపై మరింత ఒత్తిడిని పెంచింది. ఇది బలమైన డాలర్, ఫెడ్ ఫాలసీలో మార్పునకు ప్రతికూలంగా స్పందించిందని ఎల్ కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీ వైస్ ప్రెసిడెంట్ రీసెర్చ్ అనలిస్ట్ జతీన్ త్రీవేది తెలిపారు.
పీఎల్ బ్రోకింగ్, డిస్ట్రిబ్యూషన్ సీఈవో సందీప్ రాయచూర ప్రకారం..టారిఫ్ యుద్ధానికి దారితీసే ఒప్పందం వాస్తవంగా రద్దు అయ్యిందని తెలిపారు. ఫలితంగా అమెరికా డాలర్ గణనీయంగా లాభపడిందని..బంగారం ధరలపై అదనపు ఒత్తిడి ఏర్పడిందన్నారు.