Good News: గోల్డ్ కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్.. కొత్త నిర్ణయంతో బంగారు ధరలు అమాంతం డౌన్!
భారత్‌లో బంగారు విక్రయాలు డిమాండ్, పన్నుల కారణంగా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ధరలు ఉన్నాయి. దీని ప్రకారం చూస్తే.. బంగారు ధరలు చెన్నై, ముంబై ఒక ధర ఉంటే.. హైదారబాద్, కోల్‌కతాల్లో మాత్రం మరో విధంగా ఉంటాయి. అయితే ఈ ప్రాంతీయ వైవిధ్యాలే వినియోగదారులను చాలా వరకు ప్రభావింతం చేస్తాయి.
ఒక దేశం, ఒకే గోల్డ్ ప్రధానం లక్ష్యం.. దేశంలో ప్రతి నగరంలో బంగారం ఒకే ధరకు లభిస్తుంది. అంతేకాకుండా దేశంలో ఏ నగరానికి వెళ్లిన ఒకే ధరకు బంగారం కొనుగోలు చేయోచ్చు. అదే ధరకు విక్రయించే సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది.
ఒక దేశం, ఒకే గోల్డ్ ద్వారా బంగారు కొనుగోలు చేసేవారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అందులో ముఖ్యంగా ధరలను సరిపోల్చడానికి, గోల్డ్ గురించి సమాచారం తెలుసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఇప్పటికే ఈ ప్రతిపాదనకు భారతదేశంలో అన్ని ప్రధాన ఆభరణాల కంపెనీ, స్వర్ణకారుల మద్దుతు కూడా లభించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ను ఖరారు చేసినట్లు కూడా తెలుస్తోంది.
ఒక దేశం, ఒకే గోల్డ్ సంస్కరణకు సంబంధించిన అధికారక ప్రకటన 2025 సెప్టెంబర్ వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా దీనికి సంబంధించిన కీలక సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం త్వరలోనే జరపాలని కూడా భావిస్తోందట.
అంతేకాకుండా ఈ సంస్కరణను అమలు చేసే సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తినా కేంద్ర పరిష్కరించేందుకు సిద్ధంగా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా లాజిస్టికల్ పరంగా వచ్చే ఎలాంటి సమస్యలైనా కేంద్రం సులభంగా పరిష్కారించనుంది.
“ఒక దేశం, ఒకే బంగారం ధర” సంస్కరణ భారత్ అమలవుతే.. బంగారు ధరలు కూడా స్థిరంగా మారుతాయి. అంతేకాకుండా భారత్ వ్యాప్తంగా గోల్డ్ ధరలు కూడా తగ్గే ఛాన్స్‌లు ఉన్నాయి. అలాగే ఇది బంగారు మార్కెట్‌పై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు.