Gold Rate: రక్తకన్నీరు పెట్టిస్తున్న బంగారం ధర.. తులం బంగారం ఏకంగా 81,000 రూపాయలు పెరిగింది..ఇంకెంత పెరుగుతుందంటే..?
Gold News: బంగారం ధరలు ఇలా అదుపు లేకుండా పెరుగుతున్న నేపథ్యంలో ఏం చేయాలో తెలియక పసిడి ప్రియులు గగ్గోలు పెడుతున్నారు. బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనికి ప్రధానంగా అంతర్జాతీయ పరిణామాలే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. పసిడి ధరలు భారీగా పెరగడం వెనుక ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం తో పాటు దేశీయంగా ధన త్రయోదశి, దీపావళి పండుగలు వస్తున్న నేపథ్యంలో జనం ఎక్కువగా ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
దీన్ని దృష్టిలో ఉంచుకొని బంగారం ధర విపరీతంగా ఆల్ టైం రికార్డ్ స్థాయికి చేరింది. గతంలో ఎప్పుడు కూడా బంగారం 81 వేల మార్కును చూడలేదు. అలాంటిది ఈ రోజు 81 వేల మార్కును దాటి 81,500 రూపాయల స్థాయికి చేరింది. బంగారం ధరలు ఈ సంవత్సరం ప్రారంభం నుంచి గమనించినట్లయితే దాదాపు 14 వేల రూపాయలు. జూలై నెలలో బంగారం ధర 68 వేల రూపాయలకు తగ్గింది.
అక్కడ నుంచి పెరుగుతూ బంగారం ధర మూడు నెలల వ్యవధిలోనే ఏకంగా 81 వేల రూపాయలకు చేరింది. దీంతో పసిడి ప్రియులు ఆభరణాలు కొనుగోలు చేయాలంటేనే షాక్ తింటున్నారు. త్వరలోనే బంగారం ధర 1,00,000 దాటడం ఖాయంగా కనిపిస్తోంది. బంగారం ధర ఒక లక్ష రూపాయలు దాటితే ఎలా అని చాలామంది సందేహిస్తున్నారు.
అయితే భవిష్యత్తులో బంగారం ధరలు తగ్గివచ్చే పరిస్థితులు ఏమీ లేవా అని కూడా ఆలోచిస్తున్నారు. ప్రధానంగా భారతీయులకు బంగారంతో చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. ప్రతి కుటుంబం కూడా బంగారం కొనుగోలు చేస్తుంది. వివాహాది శుభకార్యాలకు బంగారం పెట్టుబడి తప్పనిసరి.
బంగారం ఆభరణాల ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం జనం తక్కువ మొత్తంలో బంగారం కొనుగోలు చేసే అవకాశం ఉందని ఆభరణాల దుకాణదారులు చెబుతున్నారు.
అయితే బంగారం భారీగా పెరిగిన నేపథ్యంలో కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే విపరీతంగా బంగారం పెరిగిన నేపథ్యంలో ఒక మిల్లీగ్రామ్ తేడా వచ్చిన మీరు వేలల్లో డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. దీని దృష్టిలో ఉంచుకొని బంగారం షాపింగ్ చేయాలని చెప్తున్నారు.