Gold Rate Today In India 30 May 2021: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు, రూ.4,600 మేర దిగొచ్చిన వెండి ధర
Gold Rate Today In India 30 May 2021: చంద్రగ్రహణం నాడు పెరిగిన తరువాత మరోసారి బంగారు ధరలు పుంజుకున్నాయి. మరోవైపు వెండి ధరలు పతనమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ వెండి ధరలు దిగిచ్చాయి. హైదరాబాద్ మార్కెట్‌లో రూ.4000 మేర ధర తగ్గడం గమనార్హం. నేటి బంగారం, వెండి రేట్లు ఇవే..
తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్ (Gold Price Today In Hyderabad) మార్కెట్లలో బంగారం ధర మరోసారి పుంజుకుంది. 24 క్యారెట్ల బంగారం రూ.100 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.49,960కు చేరుకుంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,810 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
చంద్రగ్రహణం తరువాత బంగారం ధరలు దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి పెరిగాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారంపై రూ.60 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.50,760 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,760 వద్ద మార్కెట్ అవుతోంది.
ఢిల్లీ మార్కెట్‌లో వెండి ధర స్వల్పంగా దిగొచ్చింది. దేశ రాజధానిలో వెండి ధర రూ.400 మేర పతనం కావడంతో 1 కేజీ వెండి ధర రూ.71,600కు పడిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు రూ.4,600 మేర భారీగా క్షీణించాయి. తాజాగా 1 కేజీ ధర రూ.71,600 వద్ద ట్రేడింగ్ జరుగుతోంది.