Delete These Dangerous Apps: ఈ 7 డేంజరస్ యాప్స్‌‌ను తక్షణమే Delete చేయండి

Thu, 12 Nov 2020-10:03 am,

ప్రపంచంలో అత్యధిక వినియోగదారులు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ స్మార్ట్‌ఫోన్స్ వాడుతున్నారు. వారికి ఏదైనా యాప్ కావాలంటే వెంటనే గూగుల్ ప్లే స్టోర్ (Google play store)లో తమకు సెర్చ్ చేసి యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుంటారు. అయితే యాప్స్ డౌన్‌లోడ్ చేసే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని అవాస్ట్ యాంటీ వైరస్ ప్రతినిధులు చెబుతున్నారు.

ముఖ్యంగా యాంటీ వైరస్ యాప్స్ డౌన్‌లోడ్ చేసే ఆండ్రాయిడ్ యూజర్లు జాగ్రత్తగా వ్వవహరించాలి. అవాస్ట్ పేరుతో కొన్ని ఫేక్ యాప్స్, డేటా చోరీ చేసే యాప్స్, కస్టమర్ల వివరాలు సేకరించి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసేవి ఉన్నట్లుగా గుర్తించారు. స్మార్ట్‌ఫోన్‌లో యాప్స్ ఇన్‌స్టాల్ చేసేముందు అది సరైనదా కాదా రివ్యూలు చూసి తెలుసుకోవాలి. ఎంత మంది డౌన్‌లోడ్ చేసుకున్నారో చూస్తే సైతం మనకు ఓ అవగాహన వస్తుంది.

Also Read : Samsung Galaxy F41 Price: శాంసంగ్ మొబైల్స్‌పై భారీ ఆఫర్లు, అడ్వాన్స్ క్యాష్ బ్యాక్!

మీ ఆండ్రాయిడ్ మొబైల్‌లో పొరపాటున ఈ కింది యాప్స్ డౌన్‌లోడ్ చేసినట్లయితే తక్షణమై డిలీట్ చేయాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.

Skins, Mods, Maps for Minecraft PE

Live Wallpapers HD & 3D Background

Master for Minecraft, Skins for Roblox

MasterCraft for Minecraft

Maps Skins and Mods for Minecraft

Boys and Girls Skins

ఏదైనా గూగుల్ ప్లే స్టోర్‌లో గానీ లేక ఐఓఎస్ ఓఎస్ స్టోర్‌లో అయినా యాప్స్ డౌన్‌లోడ్ చేసే ముందు యాప్ రేటింగ్ గమనించాలి. 4 అంతకన్నా ఎక్కువ రేటింగ్ ఉన్నవాటిని ఇన్‌స్టాల్ చేసుకోవడం ఉత్తమమని చెప్పవచ్చు. కొన్ని సందర్భాలలో కొన్ని రోజులు బాగున్నా ఆ తర్వాత డేటా చోరీ గురయ్యే ప్రమాదం ఉంది.

క్యాష్ ప్రైజ్, క్యాష్ బ్యాక్ అని మొబైల్‌కు లింక్ వస్తే క్లిక్ చేయవద్దని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే సైబర్ బాధితుడిగా మారిపోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. కొన్ని సందర్భాలలో డేటా చోరీ చేసి ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేయడం జరుగుతుందని, జాగ్రత్తగా ఉండాలని స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు సూచిస్తున్నారు.

Also Read : Great Diwali offer: కేవలం రూ.101 చెల్లించి రూ.49,990 స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోండి

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link