Taraka Ratna: తారకరత్న కుమార్తె హాఫ్ శారీ ఫంక్షన్.. పట్టించుకోని చంద్రబాబు, నందమూరి కుటుంబం
సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు నందమూరి తారకరత్న కన్నుమూసి ఏడాదిన్నరవుతోంది. ఆయన కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది.
తారకరత్న మరణించిన తర్వాత వారి ఇంట్లో తొలి శుభకార్యం జరిగింది. ఈ వేడుక వారి కుటుంబంలో ఆనందాలు తీసుకువచ్చింది.
తారకరత్నకు భార్య అలేఖ్య రెడ్డి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్న విషయం తెలిసిందే. భర్త మరణించినప్పటి అతడి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ పిల్లలే జీవితంగా అలేఖ్య జీవిస్తున్నారు.
ఈ క్రమంలోనే వారి పెద్ద కుమార్తె నిష్క హాఫ్ శారీ ఫంక్షన్ బుధవారం జరిగింది. హైదరాబాద్‌లో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగినట్లు తెలుస్తోంది.
పొడవైన జడతో సంప్రదాయ బంగారు వస్త్రాధారణలో నిష్కతోపాటు ఆమె తల్లి అలేఖ్య, ఆమె ఇద్దరు తమ్ముళ్లు మెరిశారు.
ఈ వేడుకకు అతికొద్ది మంది మాత్రమే హాజరైనట్లు సమాచారం. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు హాజరయ్యారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు విజయసాయి రెడ్డి కుటుంబం హాజరవడం విశేషం.
శారీ ఫంక్షన్‌లో నందమూరి కుటుంబసభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది.
తారకరత్న మరణించిన సమయంలో అతడి కుటుంబానికి టీడీపీ కుటుంబం, నందమూరి కుటుంబం అండగా ఉంటుందని ప్రకటించారు. కానీ ఈ వేడుకకు రాకపోవడం గమనార్హం.
యువగళం పాదయాత్రలో మరణించిన తారకత్న కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది.