Tuscan Villa: విక్టోరియా రాణి కోటను కొనుగోలు చేస్తారా? రాజ భవనం అ`ధర`హో
Queen Victoria Tuscan Villa: ఇటలీలో నాటి రాజులు నివసించిన భవనాలు ఇంకా ఉన్నాయి. చెక్కుచెదరని ఆ భవనాలు సొంతం చేసుకోవాలనుకునే వారికి శుభవార్త.
Queen Victoria Tuscan Villa: విక్టోరియా మహా రాణి నివసించిన టస్కాన్ విల్లా రాజభవనం అమ్మకానికి వచ్చింది. కళాత్మకంగా ఉన్న భవనం రాజసం ఉట్టి పలుకుతోంది.
Queen Victoria Tuscan Villa: ఈ భవనం ధర అక్షరాల రూ.461 కోట్లు (55 మిలియన్ డాలర్లు).
Queen Victoria Tuscan Villa: డ్రీమర్ రియల్ ఎస్టేట్ అనే సంస్థ ఈ రాజభవనాన్ని విక్రయానికి పెట్టింది.
Queen Victoria Tuscan Villa: ఫ్లోరెన్స్ శివారులో ఈ రాజ భవనం ఉంది. 14వ శతాబ్దానికి చెందిన ఈ భవనం 4 వేల చదరపు మీటర్లు (43 వేల చదరపు అడుగులు) విస్తీర్ణంలో ఉంది. 23 బెడ్‌రూమ్‌లు, 19 బాత్‌రూమ్‌లు కలిగి ఉన్నాయి.
Queen Victoria Tuscan Villa: ఈ భవనం ఆవరణలో 22 ఎకరాల్లో 9 తోటలు ఉన్నాయి. పచ్చదనంతో కళకళలాడుతోంది.
Queen Victoria Tuscan Villa: ఈ రాజభవనంలో విక్టోరియా మహారాణి 1888, 93, 94లో నివసించారు. ఈ భవనంలో కళాత్మకంగా ఫర్నీషింగ్ ఉంది.
Queen Victoria Tuscan Villa: ఈ రాజ భవనంలో టెన్నీస్ కోర్ట్, లష్ గార్డెన్, ఈత కొలను వంటి సదుపాయాలు ఉన్నాయి.
Queen Victoria Tuscan Villa: ప్రత్యేకంగా హెలిప్యాడ్ ఉంది. టస్కాన్ విల్లాను సందర్శించేందుకు పర్యాటకులు ఆసక్తి కనబరుస్తున్నారు. కాగా ఈ విల్లా విక్రయానికి పెట్టడంతో పెద్ద ఎత్తున వ్యాపారుల నుంచి డిమాండ్ వస్తోందని సమాచారం. వ్యాపారవేత్తలు, కొన్ని హోటల్ సంస్థలు ఈ విల్లాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయని తెలుస్తోంది.