Jamnagar Tourism: టాప్ 5 పర్యాటక ప్రాంతాలకు కేరాఫ్ అడ్రస్ జామ్‌నగర్
ప్రతాప్ విలాస్ ప్యాలెస్
ప్రతాప్ విలాస్ ప్యాలెస్ జామ్‌నగర్ రైల్వేస్టేషన్ నుంచి దాదాపుగా 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సౌరాష్ట్రలోని అద్బుతమైన మహల్స్‌లో ఒకటి. ఈ ప్యాలెస్‌ను జామ్ రంజిత్ సింహ్ 1907-1915 మద్యలో నిర్మించాడు.
మెరైన్ నేషనల్ పార్క్
జామ్‌నగర్ కోస్తాతీరంలో ఉన్న మెరైన్ నేషనల్ పార్క్ చాలా విశిష్టమైంది. దీనిని 1980 ఆగస్టులో శాంక్చురీ హోదా వచ్చింది. అక్టోబర్ నుంచి మార్చ్ వరకూ పర్యాటకంగా తిరగవచ్చు.
ఖజ్డియా బర్డ్ శాంక్చురీ
జామ్‌నగర్ నుంచి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో గల్ఫ్ ఆఫ్ కచ్ వద్ద దాదాపు 605 హెక్టార్లలో ఉంది. ఇక్కడ సీజనల్‌గా వచ్చే వలస పక్షులు వస్తుంటాయి.
లఖోటా ప్యాలెస్
జామ్‌నగర్‌లో లఖోటా ప్యాలెస్ చాలా అద్భుతంగా ఉంటుంది. వాస్తుకళకు అద్భుతమైన ఉదాహరణ ఇది. 19వ శతాబ్దంలో నిర్మించారు. ఇక్కడ ప్రాచీన ఆయుధాలు, ఆర్ట్, క్రాఫ్ట్, విగ్రహాలుంటాయి. ఉదయం 6 గంటల్నించి రాత్రి 10 గంటల వరకూ తెరిచి ఉంటుంది
వంతారా
అనంత్ అంబానీ జామ్‌నగర్‌లో వంతారా ప్రారంభించారు. ఇదొక కృత్రిమ అడవి. అటవీ జంతువులకు రిహాబిలిటేషన్ సెంటర్ ఇది. త్వరలో వంతారా సాధారణ పౌరుల దర్శనార్ధం తెరవబడుతుంది.