Unique Village: ఆ ఊర్లో ఎవరింట్లోనూ పొయ్యి వెలగదు, వంట వండుకోరు..కానీ కడుపు నిండా భోజనం

Tue, 24 Sep 2024-8:28 pm,

పర్యాటకం వృద్ధి

న్యూక్లియర్ ఫ్యామిలీ కారణంగా ఊర్లో ఉండే పెద్దలు ఒంటరిగా జీవితం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్య తీవ్రతను గమనించిన అతను ఎవరూ ఇంట్లో వంట వండుకోవద్దని సూచించాడు. వినూత్న వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఓ కమ్యూనిటీ హాలు నెలకొల్పి అందులో అందరికీ కావల్సిన రుచికరమైన వంటలు వండటం ప్రారంభించాడు. అదే ఇప్పటికీ కొనసాగుతోంది.

ఇంట్లో ఎందుకు వండుకోరు

ఊరి సర్పంచ్ పూనమ్ భాయి పటేల్ ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. న్యూయార్క్‌లో 20 ఏళ్లు ఉండి వచ్చిన తరువాత తన గ్రామంలోని పెద్దరు రోజువారీ పనులు చేసుకునేందుకు చాలా కష్టపడుతున్నారని గమనించాడు. ఎందుకంటే ఈ ఊర్లోని యువకులు పట్టణాల్లో ఉండిపోయారు. 

కమ్యూనిటీ హాలులో కడుపు నిండా భోజనం

ఈ కమ్యూనిటీ హాలులో రెండు పూట్ల కడుపు నిండుగా భోజనం పెడతారు. దీనికోసం ప్రతి వ్యక్తి నెలకు 2000 ఇవ్వాల్సి ఉంటుంది. గుజరాతీ వంటలు వండుతుంటారు. ఇవి పోషకాలతో నిండి రుచికరంగా ఉంటాయి. 

ఈ గ్రామం ప్రత్యేకత ఏంటి

ఈ ఊర్లో ప్రజలు ఇంట్లో వంట వండుకోరు. అంటే ఇంట్లో భోజనం చేయరు. ఇది అప్పుడప్పుడూ జరిగే ప్రక్రియ కాదు  రోజూ ఇదే పరిస్థితి. అసలు ఏ ఇంట్లోనూ స్టౌవ్ వెలగగదు. అందరూ కలిసి కమ్యూనిటీ హాల్‌లో కలిసి తింటారు

చందన్‌కీ గ్రామంలో జనాభా ఎంతమంది

2011 జనాభా లెక్కల ప్రకారం చందన్‌కీ గ్రామ జనాభా కేవంల 250 మంది ఇందులో 117 మంది పురుషులు కాగా 133 మంది మహిళలు ఉన్నారు. అయితే ఇప్పుడీ సంఖ్య 1000 వరకూ చేరినట్టు తెలుస్తోంది. కానీ ఊర్లో ఉండేది మాత్రం కేవలం 500 మంది. వీరిలో చాలా మంది వయోవృద్ధులు

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link