Guru Gochar 2024: స్థానం మారుతున్న గురుడు.. ఈ నాలుగు రాశుల వారికి ఊహించని ధనలాభం, కొత్త ఉద్యోగాలు..

Mon, 24 Jun 2024-2:41 pm,

ద్వాదశ రాశుల మీద నవగ్రహల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గ్రహాలు ఒక రాశి నుంచి మరోక రాశిలోకి తరచుగా మారుతుంటాయి. ఇలాంటి నేపథ్యంలో కొన్నిరాశుల వారికి మంచి ఫలితాలు కలిగితే, మరికొన్నింటికి చెడుఫలితాలు కల్గుతాయి. కొన్నింటికి మధ్యస్థంగా ఫలితాలు కల్గుతాయి.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం గురు గ్రహం అనేది స్థానం మారుతుంది. జూన్ నెలలో చివరి వారంలో ఈ పరిణామం చోటుచేసుకుంటుంది. దీనివల్ల కొన్నిరాశుల వారికి ఆకస్మిక ధనలాభతో పాటు, ఉన్నత స్థాయి ఉద్యోగాలు దొరుకుతాయని పండితులు చెబుతున్నారు.

వృషభ రాశివారికి అనుగ్రహ గురు ప్రభావం వల్ల వీరి జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులన్ని ఇప్పుడు నెరవేరుతాయి. కొత్తింటి కలసాకారమౌతుంది. పెద్ద వాళ్లతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు.

కన్యారాశి వారికి కోర్టుకేసుల నుంచి ఉపశమనం లభిస్తుంది. వీరికి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. భార్యవైపు నుంచి ఆస్తిలాభం కలిగే సూచనలు ఉన్నాయి.

వృశ్చిక రాశివారికి కూడా ఆకస్మిక ధనలాభం సూచనలు కన్పిస్తున్నాయి. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. బంగారం, వెండి కోనే సూచనలు కన్పిస్తున్నాయి.

మిథున రాశివారికి జీవితంలో అనుకోని మార్పులు సంభవిస్తాయి. లాటరీలు తగిలే చాన్సులు కూడా ఉన్నాయి. ఆకస్మిక ధనలాభం, కొత్త ఉద్యోగ అవకాశాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link