Guru gochar 2024: రాశి మారుతున్న గురుడు.. ఈ నాలుగు రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
జ్యోతిష్య పండితుల ప్రకారం.. గ్రహలు పన్నేండు రాశులలో సంచిస్తాయి. ఇవి స్థానం మారినప్పుడు వాటి ప్రభావం ద్వాదశ రాశులపై ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని రాశులకు మంచి ఫలితాలు కల్గితే, మరికొన్ని రాశులకు చెడుఫలితాలు కూడా కల్గుతాయి. మరికొన్నింటికి మధ్యస్థ ప్రభావం కూడా ఉంటుంది.
ముఖ్యంగా గురుగ్రహం బలం ఉంటే ఎలాంటి పనులైన ఈజీగా అయిపోతాయని పండితులు చెబుతుంటారు. అందుకు గురు గ్రహం బలంగా ఉన్నప్పుడు పెళ్లిళ్లు, ఇల్లు కొనుగోలు వంటివి చేస్తుంటారు. దీన్ని చాలా మంది ఎంతో సెంటిమెంట్ గా భావిస్తారు.
వృషభరాశి.. గురుగ్రహ ప్రభావం వల్ల వీరికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. రాదనుకుని వదలేసిన డబ్బు తిరిగి మీకు దక్కుతుంది. కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తారు.
మీన రాశి.. ఈ రాశి వారికి గురు ప్రభావం వల్ల కోర్టుకేసులలో విజయం సాధిస్తారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. విదేశీయానానికి అవకాశం ఉంది.
సింహ రాశి.. ఈ రాశి వారికి గురు గ్రహ అనుకూల ప్రభావం వల్ల.. లాటరీలు తగిలే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆకస్మిక ధనలాభంతోపాటు, చేస్తున్న బిజీనెస్ లో రాబడి విపరీతంగా వస్తుంది. దీంతో వీరు కోటీశ్వరులౌతారు.
తుల రాశి..ఈరాశి వారు కూడా చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. ఏ బిజినెస్ స్టార్ట్ చేసిన కూడా వీరికి ఈ సమయంలో తిరుగుండదు. అన్నిరకాలుగా కలసి వస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)