Hair Fall Control Oil: జుట్టు రాలడం, తెల్ల జుట్టు సమస్యలకు ఇలా 12 రోజుల్లో చెక్‌!

Wed, 26 Apr 2023-11:15 am,

కొబ్బరి నూనె, కలబంద జెల్‌ మిక్స్‌ చేసి జుట్టుకు అప్లై చేయడం వల్ల కూడా సులభంగా తెల్ల జుట్టు, జుట్టు రాలడం సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే గుణాలు పొడి జుట్టు సమస్యలు కూడా దూరమవుతాయి.   

కొబ్బరి నూనెలో మిటమిన్‌ ఈ సప్లిమెంట్స్‌లో ఉండే నూనెను కలిపి జుట్టుకు అప్లై చేస్తే జుట్టు రాలడం సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా జుట్టు రంగు కూడా సులభంగా మారుతుంది.   

కలబంద జెల్‌ను జుట్టు అప్లై చేయడం వల్ల కూడా జుట్టు రాలడం సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చర్మ సమస్యల నుంచి కూడా విముక్తి కలిగిస్తుంది. 

జుట్టు రాలడం, తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారికి కొబ్బరి నూనె ప్రభావవంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు జుట్టును దృఢంగా ఉంచడమేకాకుండా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.   

ఎండకాలంలో జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తరచుగా జుట్టును శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా చర్మ సమస్యలు రాకుండా ఉండడానికి పలు ఇంటి చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. జుట్టు రాలకుండా ఉండడానికి కొబ్బరి నూనెను వినియోగించాలి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link