Halloween Day 2024: ఈ దెయ్యాల పండుగ ఎలా వచ్చింది? తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు..!
పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఈ దుస్తులు వేసుకుంటారు.జపాన్ మెక్సికో యూకే, యూఎస్ వివిధ దేశాల్లో ఈ పండుగ జరుపుకుంటారు.
కానీ వీరు ఈ దెయ్యల దుస్తులు వేసుకుని పండుగ జరుపుకోవడానికి ప్రధాన కారణం ఆయా ప్రాంతాల్లో ఈ సమయంలోనే పంట కోతకు వస్తుంది. దీని గుర్తుగా అందరూ ఇలా వేడుకగా జరుపుకుంటారు
రెండు వేల ఏళ్ల కింద ఐర్లాండ్ లో ఈ హాలోవిన్ ప్రారంభమైంది. అప్పటి కెన్స్ వాళ్లు జరిపేవారు. షామ్ హీని అని పిలిచేవారు. వారు ఇలా దెయ్యాల దుస్తులు వేసుకోవడానికి ప్రాధాన కారణం వాళ్ల చనిపోయిన పూర్వీకులు దెయ్యాలుగా మారి భూమిపైకి వస్తారు. ఇది సూర్యాస్తమయం తర్వాత జరుగుతుందట.
ఇలా భూమి మీదకు వచ్చిన దెయ్యాలు వీళ్లను ఏదీ చేయకుండా ఉండటానికి ఇలా దెయ్యాల కాస్ట్యూమ్స్ వేసుకుంటారు. ఈ వేశాలు వేసుకోవడం వల్ల వీళ్లు కూడా దెయ్యాల అని తిరిగి వెళ్లిపోతాయట.
ఇలా ఆడుతూ పాడుతూ ప్రతి ఇంటికి తిరిగి ఎంజాయ్ చేస్తారు. చాక్లెట్స్, క్యాండీలు గిఫ్ట్‌గా తీసుకుంటారు. ఇళ్లు కూడా గుమ్మడికాయలతో హలోవీన్ బొమ్మలతో అలంకరిస్తారు.
హలోవీన్ అంటే క్రిస్టియానిటీకి సంబంధించినది. హలోమస్ అని మూడు రోజులు వారి చనిపోయిన వారి కోసం ప్రార్థిస్తూ జరుపుకునే పండుగ. 11వ శతాబ్దం నుంచి అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2 వరకు జరుపుకుంటారు
ఈ పండుగ వస్తుందంటే వారం ముందు నుంచి బట్టలు, గోస్ట్, డెవిల్ బొమ్మలను కొన్ని లక్షలు పెట్టి జరుపుకుంటారు. 1948 పంట కోతల ముగింపు ఈ పండుగ జరుపుకుంటారని మరో కథనం కూడా ఉంది.ముఖ్యంగా సెల్ట్‌లు జరుపుకుంటారు.
పూర్వం హలోవీన్‌రోజు పశువులను బలిచ్చేవారు. ఆల్ హాలో ఈవినింగ్ వల్ల హాలీవిన్ వచ్చింది. ఈ రోజు ప్రజలు వివిధ వేశాల్లో కనిపిస్తారు. ఇందులో జాక్ ఓ లాంతర్ ప్రత్యేకం. ఇది గుమ్మడి కాయల్లో లాంతర్లను పెట్టి జరుపుకుంటారు.
ఓ జాక్ అనే వృద్ధ రైతు తనను పీడిస్తున్న ఓ దెయ్యాన్ని చెట్టు మీద సిలువ వేసి బందీగా చేస్తాడట. ఆ సమయంలో అతని చేతిలో గుమ్మడికాయతో తయారు చేసిన లాంతరు ఉండేదట. దీంతోనే జీవితాంతం బతుకు అని శపించిందట దెయ్యం.
అప్పటి నుంచి ఈ వేడుక ఇలా గుమ్మడికాయ లాంతరుతో వేడుకలు జరుపుకొంటారు. ఆరెంజ్, నలుపు రంగు దుస్తులు ధరించడం మొదలైంది. ఇళ్లను కూడా దెయ్యాల ఇళ్లల అలంకరిస్తారు. ఆ దుస్తులే ధరిస్తారు. ఆనందంగా జరుపుకుంటారు.