Happy Independence Day Wishes 2024: ఒళ్లు గగుర్లు పుట్టించే దేశభక్తి కోట్స్.. శుభాకాంక్షలు..

Wed, 14 Aug 2024-9:56 pm,

స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ వేడుకలను దాదాపు ఐదు నుంచి ఏడు రోజుల పాటు జరుపుకునే వారు అయితే కాలం మారుతున్న కొద్ది ఈ స్వాతంత్ర వేడుకల్లో మార్పులు వచ్చాయి. ఇప్పుడు అంతా ఆగస్టు 15వ తేదీ ఈరోజే జరుపుకుంటున్నారు.

ఈ ఆగస్టు 15వ తేదీ రోజున జరుపుకునే స్వాతంత్ర దినోత్సవాన్ని కొన్ని చోట్ల ఎంతో ఘనంగా జరుపుకుంటారు అయితే ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగను ప్రతి ఏడు గుర్తుండిపోయేలా మీ కోసం మేము కొన్ని శుభాకాంక్షలు అందించబోతున్నాం. 

ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ ఇష్టమైన స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఇలా సులభంగా షేర్ చేయండి.  

ఇంతటి ప్రత్యేకమైన రోజు రావడానికి ఎంతో కృషి చేసి ప్రాణాలను సైతం పణంగా పెట్టి.. స్వాతంత్రం తెచ్చిన ప్రతి ఒక్క అమరవీరుడిని గుర్తుంచుకుంటూ.. వారి మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని కోరుకుంటూ.. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు..

ప్రతి ఇంట్లో ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఝాన్సీ లక్ష్మీబాయి పుట్టాలని కోరుకుంటూ.. ప్రతి భారతీయునికి పేరుపేరునా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు..  

ఈ స్వాతంత్రం కొన్ని లక్షల మంది రక్త బలిదానాల కారణంగా వచ్చింది.. కాబట్టి ఇలాంటి రోజును ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని.. వారి సేవల గురించి తెలియజేస్తూ.. వారు సూచించిన మార్గంలోనే నడవాలని కోరుకుంటూ.. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.   

మీకు మీ కుటుంబ సభ్యులందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు..  

అసాధ్యమైన స్వాతంత్రయాన్ని.. సుసాధ్యం చేసిన ప్రతి అమరవీరుడికి పాదాభివందనాలు.. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు..  

భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డ ఓ శక్తివంతమైన పౌరుడే.. మనమంతా భారత దేశంలో పుట్టడం మనం చేసుకున్న పుణ్యమే.. 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు..  

మన భారతదేశం ఎంతో గొప్పది.. ఈ గొప్ప దేశాన్ని మున్ముందు మరింత అభివృద్ధి చేయడమే మన లక్ష్యం.. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు..  

మనమంతా ఏకమై భారత్ ని అభివృద్ధి బాటలో నడిపిద్దాం.. జై జవాన్ జై కిసాన్..  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link