Honey Bee: ఒంటిపైనే తేనెటీగల్ని పెంచుకునే వ్యక్తిని ఎప్పుడైనా చూశారా

Wed, 01 Sep 2021-4:43 pm,

రాణి తేనెటీగ ద్వారా ఇతర తేనెటీగల్ని తన దేహంపైకి ఆకర్షింపచేయడం సులభమే కానీ వాటిని తొలగించేటప్ప్పుడే అసలు సమస్య ఎదురవుతుంది. మరో వ్యక్తి సహాయంతో రాణి తేనెటీగను తల చుట్టూ అమరేలా చేస్తాడు.

ఈ నేపధ్యంలో ముక్కు, చెవుల్ని దూదితో కవర్ చేస్తాడు. లేకపోతే తేనెటీగలు వాటిలో దూరిపోయే ప్రమాదముంది. కళ్ల కింద, పెదవులకు వేజ్ లీన్ రాస్తాడు. దాంతో అవి పైకి రాకుండా నియంత్రించవచ్చు.

ఈ వినూత్న అసమాన విధానంతో నాదిసాబా సుపరిచితమయ్యాడు. తన ఒంటిపై వచ్చే తేనెటీగల నుంచి వచ్చే తేనెతో మంచి ఆదాయం కూడా పొందుతున్నాడు. తేనెటీగలు తనను కుట్టకుండా ఉండేందుకు గానూ..మద్యమధ్యలో పంచదార నీటిని స్ప్రే చేస్తుంటాడు.

తేనెటీగల్ని నియంత్రించేందుకు ముందుగా రాణి తేనెటీగను అణ్వేషించాల్సి వస్తుందని నాదిసాబా అంటున్నాడు. ఆ తేనెటీగను ఆకర్షించి తన ఒంటిపై ఉంచుకుంటాడు. ఈ కిటుకుతో అన్ని తేనెటీగల్ని తనవైపుకు ఆకర్షిస్తుంటాడు. రాణి తేనెటీగ తన ఒంటిని పట్టి ఉంచేందుకు ఓ చిన్న తాడు నడుము చుట్టూ కట్టుకుంటాడు. ఇంకేముంది ఆ తరువాత రాణి తేనెటీగ రక్షణ కోసం మిగిలిన తేనెటీగలన్నీ అక్కడికి చేరుతాయి. ఇప్పటి వరకూ ఒక్క తేనెటీగ కూడా తనను కుట్టలేదని చెబుతున్నాడు.

రువాండాకు చెందిన నాదిసాబా గత 30 ఏళ్లుగా తన ఒంటిపై తేనెటీగల్ని పెంచుతున్నాడు. అందుకే ఎప్పుడూ సరైన ఒంటిపై సరైన బట్టలు ధరించడం లేదు. తేనెటీగల తుట్టె అతని ఒంటిపై ఓ కోటులా కన్పిస్తోంది. తేనెటీగలతో కప్పబడి ఉంటున్న ఇతని ఫోటోలు సోషల్ మీడియాలో వచ్చిన తరువాత నాదిసాబా గురించి అందరికీ తెలిసింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link