Revanth Reddy Birth Day: ఎక్కడా చూడని రేవంత్‌ రెడ్డి అరుదైన ఫొటోలు.. 10 ముఖ్యమైన విషయాలు

Fri, 08 Nov 2024-12:31 am,

స్వస్థలం: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి రేవంత్‌ రెడ్డి స్వగ్రామం.

ఉమ్మడి కుటుంబం: ఎనుముల వంశంలో రేవంత్‌ రెడ్డి కుటుంబం చాలా పెద్దది. రేవంత్‌కు ఏడుగురు సోదరులు, ఒక సోదరి.

కుటుంబం: రేవంత్ రెడ్డికి భార్య, కుమార్తె, అల్లుడు మనవడు రియాన్ష్‌ రెడ్డి ఉన్నారు. రేవంత్‌కు రాజకీయంగా, వ్యాపారపరంగా సోదరులు అండగా నిలుస్తుండడం విశేషం.

పెయింటింగ్‌ పని: తొలి దశలో రేవంత్‌ రెడ్డి పెయింటింగ్‌ పని చేశారని అక్కడి గ్రామస్తులు, అతడి సన్నిహితులు చెబుతున్నారు. అనంతరం వ్యాపారం చేస్తూ రాజకీయాల్లోకి వచ్చి విజయవంతమయ్యారు.

తొలి ఉద్యోగం: ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన 'జాగృతి' అనే వార పత్రికలో రేవంత్‌ పని చేశారు. ఆ క్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌తో రేవంత్‌కు మంచి అనుబంధం ఉంది. తదనంతరం అప్పటి టీఆర్‌ఎస్‌ పార్టీ (బీఆర్‌ఎస్‌)లో చేరి కార్యకర్తగా పని చేశారు.

టీఆర్‌ఎస్‌లో బిజీ: బీఆర్‌ఎస్‌ పార్టీలో రేవంత్‌ గులాబీ కార్యకర్తగా చురుగ్గా ఉన్నారు. ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు, ప్రస్తుత మాజీమంత్రి హరీశ్ రావు వెంట రేవంత్‌ రెడ్డి తిరిగాడు.

టీడీపీలోకి: స్వతంత్ర అభ్యర్థిగా జెడ్పీటీసీగా పోటీచేసిన రేవంత్‌ రెడ్డి అప్పటి టీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతుగా గెలిచారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు.

అరెస్ట్‌ కీలక మలుపు: తెలుగుదేశం పార్టీ నుంచి కొడంగల్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్సీ ఓటు విషయంలో ఓటుకు నోటుకు పాల్పడుతూ అరెస్ట్‌ కావడం రేవంత్‌ జీవితాన్ని కీలక మలుపు తిప్పింది.

అదృష్టం కలిసి: పిన్న వయసులో పీసీసీ అధ్యక్షుడిగా.. ముఖ్యమంత్రిగా కావడం రేవంత్‌ రెడ్డి అదృష్టంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

చెడ్డపేరు: అధికారంలోకి వచ్చి 10 నెలలు కూడా పూర్తి కాలేదు కానీ ఏ ముఖ్యమంత్రి ఎదుర్కోని రీతిలో ప్రజల నుంచి రేవంత్‌ రెడ్డి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం.. దురుసు ప్రవర్తన, భాష అనేది రేవంత్‌ రెడ్డికి చెడ్డపేరు తీసుకొస్తోంది.

శుభాకాంక్షలు: ముఖ్యమంత్రిగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ జీ తెలుగు న్యూస్‌ తరఫున రేవంత్‌ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link