Home Loan EMIs: ఈ బ్యాంకులో హోమ్ లోన్ తీసుకున్న వారికి బ్యాడ్ న్యూస్
HDFC Bank Home Loan Interest Rates, EMIs: సాధారణంగా హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ హోమ్ లోన్స్ పై 8.95 శాతం నుంచి 9.85 శాతం వడ్డీ రేటు వసూలు చేస్తుండగా.. వేతన జీవులకు మాత్రం 8.45 శాతం నుంచి 8.95 శాతం వడ్డీ రేటుకు హోమ్ లోన్స్ ఆఫర్ చేస్తోంది. సిబిల్ స్కోర్ తో పాటు లోన్ తీసుకునే మొత్తం నుంచి లోన్ టెన్యూర్ వరకు వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ వడ్డీ రేటును నిర్ణయిస్తారు.
HDFC Bank Home Loan Interest Rates, EMIs: ఉదాహరణకు ఒకవేళ ఎవరైనా మహిళలు రూ. 30 లక్షల వరకు హోమ్ లోన్ తీసుకోవాలని అనుకుంటే.. వారికి 8.95 శాతం నుంచి 9.45 శాతం వడ్డీ రేటు చార్జ్ చేస్తారు. అదే రూ. 30 లక్షల హోమ్ లోన్ పురుషులకు అయితే, 9 శాతం నుంచి 9.5 శాతం వడ్డీ రేటు వసూలు చేస్తారు.
HDFC Bank Home Loan Interest Rates, EMIs: ఒకవేళ మీరు తీసుకునే లోన్ మొత్తం రూ. 30 లక్షల నుంచి రూ. 75 లక్షల మధ్య ఉన్నట్టయితే.. 9.2 శాతం నుంచి 9.7 శాతం వరకు వడ్డీ రేటు చార్జ్ చేస్తారు. రూ. 75 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో హోమ్ లోన్ తీసుకున్నట్టయితే.. 9.3 శాతం నుంచి 9.8 శాతం వరకు వడ్డీ రేటు వసూలు చేస్తారు.
HDFC Bank Home Loan Interest Rates, EMIs: సాధారణంగా బ్యాంకులన్నీ రిటేల్ ప్రైమ్ లెండింగ్ రేటు ఆధారంగా వడ్డీ రేటును నిర్ణయిస్తాయి. రిటేల్ ప్రైమ్ లెండింగ్ రేటు పెరిగితే వడ్డీ రేటు పెరుగుతుంది. వడ్డీ రేటు పెరిగిందంటే.. నెలా నెలా బ్యాంకులకు చెల్లించే హోమ్ లోన్ ఇఎంఐ భారం కూడా అంతే స్థాయిలో పెరుగుతుంది.
HDFC Bank Home Loan Interest Rates, EMIs: అందుకే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ హోమ్ లోన్స్ తీసుకున్న వారికి ఇకపై హోమ్ లోన్ ఇఎంఐ భారం కూడా పెరగనుంది. ఇది వారికి బ్యాడ్ న్యూసే అవుతుంది కదా మరి.