Pista Benefits: రోజూ పిస్తా ఎందుకు తినాలి, ప్రయోజనాలు తెలిస్తే ఇక వదిలిపెట్టరు
బరువు నియంత్రణ
బరువు తగ్గించుకోవాలనుకునేవారు పిస్తాను రోజూ తింటే చాలా మంచిది. బెస్ట్ డైటింగ్ ఫార్ములా అని చెప్పవచ్చు. ఇందులో హెల్తీ కేలరీస్ ఉంటాయి. రోజూ తగిన మోతాదులో పిస్తా తినడం వల్ల చాలా వరకూ అధిక బరువు సమస్య తొలగిపోతుంది.
గుండె ఆరోగ్యం
రోజూ నియమిత మోతాదులో పిస్తా తినడం వల్ల రక్త నాళికల్లో పేరుకునే కొలెస్ట్రాల్ దూరం చేయవచ్చు. ఫలితంగా రక్తపోటు నియంత్రణలో వచ్చేస్తుంది. హార్ట్ ఎటాక్ వంటి వ్యాధుల ముప్పు తగ్గుతుంది.
కంటి చూపు
వయస్సు రీత్యా కళ్లకు ఎదురయ్యే మ్యాక్యులర్ డీజనరేషన్ సమస్యల్నించి కాపాడే పోషకాలు పిస్తాలో చాలా ఉంటాయి. అందుకే పిస్తా రోజూ తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. మొబైల్, ల్యాప్‌టాప్ కారణంగా ఎదురయ్యే బ్లూ ష్క్రీన్ ప్రభావం నుంచి కూడా కాపాడుతుంది.
జీర్ణక్రియ
పిస్తాలో పుష్కలంగా డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తొలగిపోతాయి.
డయాబెటిస్ నియంత్రణ
పిస్తా గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఫెనోలిక్ కాంపౌండ్, కెరోటినాయిడ్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. డయాబెటిక్ రోగులకు బెస్ట్ డైట్ అని చెప్పవచ్చు.