Snake Fruit: స్నేక్ ఫ్రూట్ తింటున్నారా..అయితే దీని ఉపయోగాలు తెలిస్తే ఆసుపత్రికి జీవితంలో వెళ్లరు
ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల పండ్లు ఉన్నాయి. పండ్లు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అనేక వ్యాధులతో పోరాడడంలో.. మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో పండ్లు చాలా సహాయపడతాయి. అయితే స్నేక్ ఫ్రూట్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. కంటి ఆరోగ్యం నుంచి జ్నాపకశక్తి వరకు అనేక లాభాలు ఉన్నాయని పోషకనిపుణులు చెబుతున్నారు.
ఈ పండు వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకునే ముందు ఈ పండు ఎక్కడ లభిస్తుందో తెలుసుకుందాం. ఈ పండు ఇండోనేషియాలోని బాలి, లాంబాక్, తైమూర్ దీవులలో ప్రత్యేకంగా సాగు చేస్తున్నారు. మీరు ఈ పండును కొనుగోలు చేయాలంటే సూపర్ మార్కెట్లలో అందుబాటులో ఉన్నాయి.
ఈ పండు ఆకారం లిచీ లాగా ఉంటుంది. ఈ పండులోపల పెద్ద విత్తనం కూడా ఉంటుంది. పై భాగం పాము చర్మంలా కనిపిస్తుంది..తొక్క, దానిని తీసివేసిన తర్వాత, పండు తెల్లటి భాగం చాలా తియ్యగా ఉంటుంది.
స్నేక్ ఫ్రూట్ తింటే రోగనిరోధకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఈపండులో కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, అనేక రకాల ఖనిజాలు కూడా ఇందులో ఉంటాయి. ఇది మన శరీరంలో నీటి కొరతను నివారిస్తుంది.
స్నేక్ ఫ్రూట్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్, ఫైబర్, ఫాస్పరస్ రక్తంలోని షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తాయి. గర్భిణీలకు ఈ పండు ఎంతో మేలు చేస్తుంది.
చిన్నపిల్లలకు ఈ పండు తినిపిస్తే ఎంతో మేలు జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులోని పోషకాలు పిల్లల్లో జ్ఞాపకశక్తిని బలోపేతం చేయడంతో పాటు మెదడును కూడా పదును పెడుతుంది.
అధిక బరువుతో బాధపడేవారు కూడా స్నేక్ ఫ్రూట్ ను డైట్లో చేర్చుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫ్రూట్ తింటే బరువు తగ్గుతారు. అంతేకాదు జీర్ణ వ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
స్నేక్ ఫ్రూట్ తింటే కళ్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఈ పండులో పొటాషియం అధిక మోతాదులో ఉంటుంది. ఇది గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది.