Health Remedies: ఈ 5 వ్యాయామాలు ఆచరిస్తే కిడ్నీ, లివర్ ఎప్పటికీ చెడిపోవు
ప్రాణాయామం
ప్రాణాయామం రోజూ క్రమం తప్పకుండా ఆచరిస్తే లివర్, కడ్నీల్లో ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది. డీప్ బ్రీతింగ్ తీసుకోవడం ద్వారా శరీరంలో విష పదార్ధాలు సులభంగా తొలగించవచ్చు. రోజూ కనీసం 10-15 నిమిషాలు ఈ ఆసనం వేయాలి.
ట్విస్టింగ్ యోగాసనం
యోగా అనేది ఆరోగ్యానికి బెస్ట్ వ్యాయామం. ఇందులో ట్విస్టింగ్ పోజు అంటే మత్యేంద్రాసనం లివర్, కిడ్నీలను శుభ్రపర్చేందుకు బాగా ఉపయోగపడుతుంది. వ్యర్ధాలు తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. లివర్, కిడ్నీల పనితీరు మెరుగుపరుస్తుంది
డాన్స్ వర్కవుట్
డాన్సింగ్ అనేది ఆసక్తిగా ఉండటమే కాకుండా శరీరంలోని వ్యర్ధాలను చెమట ద్వారా బయటకు పంపిస్తుంది. 15-20 నిమిషాలు చేయాల్సి ఉంటుంది.
సేతు బంధాసనం
ఈ యోగాసనంతో కడుపు, నడుము కండరాలు బలోపేతమౌతాయి. కిడ్నీ, లివర్‌లో రక్త ప్రసరణ పెరుగుతుంది. దాంతో డీటాక్సిఫికేషన్ ప్రక్రియ మెరుగుపడుతుంది
స్కాట్స్
స్కాట్స్ అనేది రక్త సరఫరా వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఫలితంగా కిడ్నీ ప్రధాన విధి ఫిల్టరైజేషన్ సరిగ్గా ఉంటుంది. రోజూ 15-20 నిమిషాలు స్కాట్స్ చేయడం వల్ల డీటాక్సిఫికేషన్ అద్భుతంగా జరుగుతుంది.