Curry Leaves Water: రోజూ కరివేపాకు నీళ్లు ఇలా తాగితే, డయాబెటిస్, ఇమ్యూనిటీ, స్థూలకాయం అన్నింటికీ సమాధానం

Thu, 14 Dec 2023-9:43 pm,

వెయిట్ కంట్రోల్

రోజూ ఉదయం పరగడుపున కరివేపాకుల్ని నీళ్లలో ఉడకబెట్టి తాగడం వల్ల బరువు నియంత్రణలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా నియంత్రణలో ఉంటాయి. ఒత్తిడి , ఆందోళన కూడజా తగ్గుతాయి.

డీటాక్స్ మరియు డయాబెటిక్ నియంత్రణ

కరివేపాకుల్ని ఉడకబెట్టి తాగడం వల్ల శరీరం డీటాక్స్ అవుతుంది. రోజూ తాగడం అలవాటు చేసుకుంటే శరీరంలో ఉండే హానికారక పదార్ధాలు తొలగిపోతాయి. రక్తం శుద్ధి అవుతుంది. దాంతోపాటు బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా నియంత్రణలో ఉంటాయి. డయాబెటిస్ రోగులకు అద్భుతంగా పనిచేస్తుంది. 

వికారం

చలికాలంలో మార్నింగ్ సిక్నెస్ లేదా వికారం సమస్య ఎక్కువగా ఉంటుంది. రోజూ కరివేపాకు నీళ్లను తాగడం వల్ల ఈ సమస్య పోతుంది. వికారం, విరేచనాలు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

రక్తహీనత దూరం 

కరివేపాకులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. నిర్ణీత మోతాదులో సేవించడం వల్ల ఎనీమియా దూరమౌతుంది. ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్ శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. 

ఇమ్యూనిటీ బూస్ట్

కరివేపాకులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బయోటిక్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. కరివేపాకుల్ని నీళ్లలో ఉడకబెట్టి రోజూ ఉదయం తాగడం వల్ల శరీరం రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ వ్యాధులు దూరమౌతాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link