Saffron Benefits: పాలలో ఇది కలుపుకుని తాగితే అద్భుతమై అందంతో పాటు ఆరోగ్యం మీ సొంతం
కంటి సమస్యలు
కుంకుమ పాలు తాగడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కంటి సంబంధిత వ్యాధులు చాలావరకూ నయమౌతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అందుకు దోహదం చేస్తాయి.
చర్మంపై మచ్చలు
ముఖంపై మచ్చలు, మరకలు వంటివి బాధిస్తుంటే కుంకుమ పాలు అద్భుతంగా దోహదపడతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అందుకు ఉపయోగపడతాయి.
గుండె సంబంధిత వ్యాధులు
గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడేవాళ్లకు కుంకుమ పువ్వు తప్పకుండా తాగమని వైద్యులు సూచిస్తుంటారు. ఎందుకంటే గుండెను ఆరోగ్యంగా ఉంచే పోషకాలు ఇందులో చాలా ఎక్కువ.
జీర్ణ సంబంధిత సమస్యలు
కుంకుమ పాలను రాత్రి వేళ తాగడం వల్ల కుడుపు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
ఒత్తిడి
కుంకుమ పువ్వు ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాల్లో అత్యంత ఖరీదైంది. దీంతో లాభాలు కూడా అంతే ఎక్కువ. కుంకుమను పాలలో కలిపి తాగితే వీటి లాభాలు మరింతగా పెరుగుతాయి. కుంకుమ పాలు తాగడం వల్ల ఒత్తిడి దూరమౌతుందంటారు ఆరోగ్య నిపుణులు.