Vitamin B12: విటమిన్ బి12 లోపముంటే..నిర్లక్ష్యం చేయవద్దు, బాడీ గుల్లగా మారిపోతుంది
సైమన్ చేపలు
విటమిన్ బి 12తో పాటు అన్ని పోషక పదార్ధాలు కావాలంటే సైమన్ చేపలు తప్పకుండా తినాలి.
మాంసం
మాంసంలో విటమిన్ బి12 పుష్కలంగా లభిస్తుంది. అందుకే క్రమం తప్పకుండా మాంసం తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ బి12తో పాటు బీ2, బీ3, బీ6 కూడా ఉంటాయి.
పాల ఉత్పత్తులు
పాలు, ఇతర పాల ఉత్పత్తులైన పెరుగు, పన్నీర్‌లో ప్రోటీన్లు, విటమిన్ బి12 పుష్కలంగా లభిస్తాయి.
టూనా చేపలు
టూనా చేపల్లో ప్రోటీన్లు, విటమిన్లతో పాటు మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. పోషక పదార్ధాలు పెద్దమొత్తంలో ఉంటాయి. ఇందులో విటమిన్ బి 12 కూడా ఉంటుంది.
గుడ్లు
మీ శరీరంలో విటమిన్ బి12 లోపముంటే..రోజూ గుడ్లు తినడం ద్వారా ఆ లోపాన్ని సరి చేసుకోవచ్చు. ఇందులో విటమిన్ బి12 పుష్కలంగా లభిస్తుంది.