Drinking Water: భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగితే ఏమౌతుంది, ఎలాంటి సమస్యలు ఏర్పడతాయి
నీళ్లెప్పుడు తాగాలి
భోజనం చేసిన తరువాత కనీసం అరగంట ఆగి అప్పుడు నీళ్లు తాగితే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. 45 నిమిషాల తరువాత తాగితే మరీ మంచిదంటున్నారు.
కడుపులో నొప్పి
భోజనం చేసిన తరువాత నీళ్లు తాగడం వల్ల కడుపు నొప్పి సమస్య రావచ్చు. కడుపు చుట్టూ గట్టిగా ఉండి నొప్పి బాధిస్తుంది.
కడుపులో మంట
భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగడం వల్ల కడుపులోని భోజనంతో నీళ్లు కలిసిపోతాయి. దాంతో కడుపులో ఉండే యాసిడ్, డైజెస్టివ్ ఎంజైమ్ పల్చగా మారిపోతాయి. దాంతో భోజనం జీర్ణంలో సమస్య ఏర్పడుుతంది. కడుపులో మంట ప్రారంభమౌతుంది.
గ్యాస్
భోజనం చేసిన వెంటనే నీల్లు తాగడం వల్ల భోజనం, నీళ్లూ రెండూ కలిసిపోతాయి. దీంతో కడుపులో గ్యాస్ సమస్య ఏర్పడుతుంది.
అజీర్తి
భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగడం లేదా భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగడం వల్ల కడుపులోని భోజనం పల్చగా మారి కడుపు బరువుగా తయారౌతుంది. జీర్ణ సమస్య తలెత్తుతుంది.