Diabetes Prevention Tips: ఈ 5 అలవాట్లు అలవర్చుకుంటే డయాబెటిస్ ముప్పు ఉండదిక
బరువు తగ్గించడం
మధుమేహం రాకుండా ఉండాలంటే ముందుగా స్థూలకాయం లేదా అధిక బరువుకు చెక్ పెట్టాలి. స్థూలకాయం మధుమేహానికి దారితీసే ప్రధాన కారణం. దీనికోసం హెల్తీ డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండాలి.
నీళ్లు తాగడం
శరీరాన్ని ఎప్పుడై హైడ్రేట్‌గా ఉంచేందుకు తగిన నీళ్లు తాగుతుండాలి. వేసవిలో అయితే మరింత ఎక్కువగా తీసుకోవాలి. సోడా, ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూస్‌కు దూరంగా ఉండాలి. లేకపోతే టైప్ 2 డయాబెటిస్ ముప్పును ఎదుర్కోవల్సి వస్తుంది.
ధూమపానం
సిగరెట్, బీడీ, హుక్కా, గంజాయి వంటివి ఆరోగ్యానికి ప్రమాదకరం. వీటివల్ల శ్వాసకోశ వ్యవస్థపై ప్రబావం పడుతుంది. అదే సమయంలో డయాబెటిస్ ముప్పును పెంచుతుంది. అందుకే ఈ అలవాట్లకు దూరంగా ఉండాలి.
వ్యాయామం
రోజూ వ్యాయామం చేస్తుంటే డయాబెటిస్ ముప్పు చాలా వరకూ తగ్గుతుంది. ఎందుకంటే వ్యాయామం కారణంగా అదనంగా ఉండే కొవ్వు కరుగుతుంది. దాంతో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.
కార్బోహైడ్రేట్ ఫుడ్ తగ్గించడం
కార్బోహైడ్రేట్లు కూడా శరీరానికి అవసరమే. అయితే ఇవి మోతాదు మించకూడదు. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరం వాటిని చిన్న చిన్న షుగర్ కణాలుగా మార్చి రక్తంలో కలిపేస్తుంది. దాంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి.