Cholesterol Tips: కొలెస్ట్రాల్ తగ్గాలంటే డైట్‌లో ఈ పదార్ధాలు ఉండాల్సిందే
వంకాయ, బెండకాయ రెండూ లో కేలరీ ఆహార పదార్ధాలు. ఇందులో సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇవి కొలెస్ట్రాల్‌ను శరీరం నుంచి బయటకు తొలగిస్తాయి.
కొలెస్ట్రాల్ తగ్గించేందుకు డైట్‌లో కెనోలా, సన్‌ఫ్లవర్ లేదా వెజిటబుల్ ఆయిల్ చేర్చాల్సి ఉంటుంది. వీటిలో ఉంటే మోనో అన్‌శాచ్యురేటెడ్, పోలీ అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. తద్వారా చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది.
చెడు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు సోయా మిల్క్ లేదా సోయా ఉత్పత్తులు అద్భుతంగా పనిచేస్తాయి. సోయా ఉత్పత్తుల్లో ఉండే ప్రోటీన్లు చెడు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు ఉపయోగపడతాయి.
బ్రేక్ ఫాస్ట్‌లో ఓట్స్ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ అద్భుతంగా తగ్గుతుంది. ఓట్స్‌తో పాటు అరటిపండ్లు తీసుకోవడం చాలా ప్రయోజనకరం. ఓట్స్‌లో సాల్యుబుల్ ఫైబర్ ఉంంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను రక్త నాళాల్నించి తొలగించేందుకు దోహదపడుతుంది.
యాపిల్, ద్రాక్షలను డైట్‌లో చేర్చడం వల్ల చెడు కొలెస్ట్రాల్ వేగంగా తగ్గుతుంది. ఇందులో ఉండే పేక్టిన్ ఇందుకు ఉపయోగపడుతుంది. ఇదొక రకమైన సాల్యుబుల్ ఫైబర్. సాల్యుబుల్ ఫైబర్ అనేది కొలెస్ట్రాల్ నిర్మూలనలో అద్బుతంగా ఉపయోగపడుతుంది.