Healthy Drinks: డయాబెటిస్, కొలెస్ట్రాల్ ఇతర వ్యాధుల్ని దూరం చేసే 5 అద్భుత డ్రింక్స్ ఇవే
లవంగం నీళ్లు కూడా ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. లవంగంలో యాంటీ మైక్రోబియల్స్ , యాంటీ ఫంగల్ గుణాలున్నాయి. రోజూ ఉదయం పరగడుపున లవంగం నీళ్లు తాగితే మంచి ఫలితాలుంటాయి.
అల్లం అనేది అద్భుతమైన ఔషధం. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలున్నాయి. అల్లం నీటితో బాడీ పెయిన్స్,స్వెల్లింగ్ తగ్గుతాయి. రోజూ ఉదయం పరగడుపున అల్లం నీరు తీసుకుంటే అద్భుత ప్రయోజనాలున్నాయి.
మెంతులు ఆరోగ్యానికి చాలా ప్రయోజనం. డయాబెటిస్ రోగులకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో కరిగే గుణమున్న ఫైబర్ ఉంది. బ్లడ్ షుగల్ లెవెల్స్ తగ్గుతాయి.
మరో అద్భుతమైన పదార్ధం వాము. వాము నీళ్లు క్రమం తప్పకుండా తీసుకుంటే అధిక బరువు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
సోంపు నీళ్లు చర్మ సంరక్షణకు అద్బుతంగా ఉపయోగపడతాయి. ఇందులో సెలేనియం, కాల్షియం, జింక్, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. సోంపు నీరు తీసుకుంటే బ్లడ్‌లో ఆక్సిజన్ బ్యాలెన్స్‌గా ఉంటుంది.