Healthy Foods: మీ పిల్లలకు పరగడుపున ఈ 5 పదార్ధాలు ఇస్తే అన్ని సమస్యలకు చెక్
పప్పు
పప్పుల్లో ప్రోటీన్ శాతం ఎక్కువ. బరువు తగ్గించేందుకు కూడా ఉపయోగపడుతుంది.
అరటి పండ్లు
రోజూ ఉదయం పరగడుపున అరటి పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. కడుపు సంబంధిత సమస్యలు చాలావరకూ దూరమౌతాయి. బలహీనంగా ఉన్న పిల్లలకు మరీ మంచిది.
గోరు వెచ్చని నీరు
రోజూ ఉదయం లేచిన వెంటనే గోరు వెచ్చని నీళ్లు తాగడం అలవాటు చేయాలి. దీనివల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు దూరమౌతాయి.
ఆపిల్
ఆపిల్ ఎ డే కీప్ ద డాక్టర్ ఎవే అన్నారు. ఇది ముమ్మాటికీ నిజం. రోజుకో ఆపిల్ తినడం అలవాటు చేసుకుంటే పిల్లల కంటి ఆరోగ్యానికి మంచిది. ఇందులో ఉండే కాల్షియం, ఐరన్, జింక్ వంటివి ఆరోగ్యానికి చాలా మంచిది.
బాదం
మీ పిల్లలు ఫిట్ అండ్ హెల్తీగా ఉండాలంటే బాదం అద్భుతమైన పదార్ధం. ఇందులో ఉండే విటమిన్లు, మినరల్స్, ఫ్యాట్ వంటి పోషకాలు ఆరోగ్యానిక్ చాలా ప్రయోజనం చేకూరుస్తాయి. అందుకే రోజూ పరగడుపున 5 బాదం గింజలు నానబెట్టి తిన్పించాలి.