Heart Stroke: గుండె పోటుకు ముందు మనలో కన్పించే ఖచ్చితమైన సింప్టమ్స్ ఇవే..
ఒకప్పుడు గుండెపోటు అనేది 40 ఏళ్లు దాటిన వాళ్లలో కన్పించేది. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా.. చిన్నారుల్లో కూడా గుండెపోటులు వస్తున్నాయి. అప్పటి వరకు బాగా ఉన్న వాళ్లు సడెన్ గా గుండెపోటుతో చనిపోతున్నారు.
కొంతమంది డ్యాన్స్ లు చేస్తు, జిమ్ లు చేస్తు స్ట్రోక్ లకు గురౌతున్నారు. మరికొందరు ఏదైన ఆఫీసు వర్క్ చేస్తు అలానే కుప్పకూలీపోతున్నారు.
వాకింగ్ చేసి వచ్చి ఆయాసంలో కూడా కొంత మంది గుండెపోటుకు గురౌతున్నారు. ఇటీవల కాలంలో యువత ఇష్టమున్నట్లు జంక్ ఫుడ్ ను ఎక్కువగా తింటున్నారు.
తినే టైమ్ లో పడుకొవడం, రాత్రిళ్లు మేల్కొవడం వల్ల జీవ గడియారం పూర్తిగా దెబ్బతిందని చెప్పుకొవచ్చు. అందుకే చాలా మంది గుండెపోటుల బారిన పడుతున్నారు.
అయితే..గుండె పోటుకు రావడానికి మందు శరరీంలో కొన్నిమార్పులు సంభవిస్తాయంట. అది గుర్తుపడితే.. మాత్రం స్ట్రోక్ సమస్యల నుంచి బైటపడొచ్చు.
చాలా మందికి చెమట వస్తుంది. ఎడమ చెయ్యి తెగ లాగేస్తుంటుంది. ఛాతీమీద ఎడమ భాగంలో నొప్పి వస్తుంది. కళ్లు బైర్లు కమ్ముతుంటాయి. నోట మాట రాదు. ఇలాంటి పరిస్థితుల్లో కొంత అలర్ట్ అయి డాక్టర్ దగ్గరకు వెళ్లే స్ట్రోక్ నుంచి బైటపడొచ్చు.
అదే విధంగా సమయానికి మంది ఫుడ్ లు, ఫ్రూట్స్ లను తీసుకుంటు ఉండాలి. ఇలా టైమ్ టేబుల్ ను పాటిస్తే ఎలాంటి హెల్త్ కు సంబంధించిన సమస్యలు దరిచేరవు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)