Delivery Boy: తండ్రి అంటే ఇలా ఉండాలి.. జొమాటో డెలివరీ బాయ్ కథ చదవండి
Heart Touching Story: ఫుడ్ ఆర్డర్ తీసుకోవడానికి హోటల్‌కు జొమాటో డెలివరీ బాయ్ తన కుమార్తెతో వచ్చాడు. రెండేళ్ల కుమార్తెతో కలిసి రావడాన్ని హోటల్ నిర్వాహకులు కారణం ఆరా తీశారు.
Heart Touching Story: ఢిల్లీ ఖాన్ మార్కెట్‌లోని స్టార్‌బక్స్ కాఫీ షాప్ కు సోనూ అనే జొమాటో డెలివరీ పార్టనర్ వచ్చాడు.
Heart Touching Story: ఆర్డర్ తీసుకోవడానికి వచ్చిన సోనూను కాఫీ షాప్ మేనేజర్ దేవేంద్ర మెహ్రా ఆసక్తిగా గమనించాడు.
Heart Touching Story: పాపను తీసుకుని రావడమేమిటని ప్రశ్నించాడు. సోనూ వివరాలు అడిగి తెలుసుకుని విస్తుపోయారు
Heart Touching Story: అనంతరం సోనూను అభినందించి రెండేళ్ల పాపకు ఐస్‌క్రీమ్ తినిపించారు. సోనూ విషయాలను దేవేంద్ర మోహ్రా తన సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు.
Heart Touching Story: 'ఢిల్లీలో నివసిస్తున్న సోనూకు రెండేళ్ల కుమార్తె ఉంది. అయితే తల్లి లేకపోవడంతో పాప ఆలనాపాలనా మొత్తం సోనూ చూసుకుంటున్నాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో డెలివరీలకు వెళ్తూ తన వెంట పాపను తీసుకెళ్తున్నాడు' అని దేవేంద్ర వివరించాడు.
Heart Touching Story: హృదయాన్ని పిండేసే సోను కథ విని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరికొందరు సోనూకు సహాయం చేసేందుకు ముందుకువచ్చారు. సోను కథ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. జొమాటో, స్టార్‌బక్స్ సంస్థలు సోనూకు ఏదైనా సహాయం చేయాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.