Cyclone Fengal: బిగ్ అలర్ట్.. ఫెంగల్ తుపాను ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో ఆకస్మిక వరదలు..!

Sat, 30 Nov 2024-6:22 am,

దక్షిణ కోస్తా, రాయలసీమలో నేడు, రేపు అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, కొన్నిచోట్ల అతి తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.  

ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.  

నేడు మధ్యాహ్ననానికి ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల సమీపంలో కారైకాల్, మహాబలిపురం మధ్య పుదుచ్చేరి దగ్గరలో తుపానుగా తీరం దాటే అవకాశం ఉందన్నారు.  

తిరుపతి, నెల్లూరు, ప్రకాశం తీరం వెంబడి 70-90 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్‌ తెలిపారు.  

నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది.  

మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లరాదని అధికారులు స్పష్టం చేశారు. కృష్ణపట్నం పోర్టుకు 3వ నంబరు హెచ్చరిక జారీ చేయగా.. మిగిలిన పోర్టులకు రెండో నంబరు హెచ్చరిక జారీ చేశారు.   

మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో తమిళనాడులోని ఏడు జిల్లాలకు అధికారులు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేశారు. వదర ప్రభావిత ప్రాంతాల్లో సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link