Patangi Toll plaza: సంక్రాంతిని గుర్తుకు తెచ్చిన ఓట్ల పండగ.. పతంగీ టోల్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్..
దేశంలో ఎన్నికల సీజన్ నడుస్తుంది. ముఖ్యంగా ఇరు తెలుగు రాష్ట్రాలలో ఓట్లు వేయడానికి జనాలు తమ సొంత గ్రామాలకు భారీగా క్యూలు కట్టారు. ఈ క్రమంలో ఇప్పటికే బస్సులు, రైళ్లు, విమానాలు కూడా కిట కిటలాడుతున్నారు. ఇక ప్రైవేటు వాహానాలు భారీగా రెట్లను పెంచేశాయి.
ఒకప్పుడు ఏపీకి సంక్రాంతి పండుగ నేపథ్యంలో పంతిగి టోల్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయి కన్పించేది. ప్రస్తుతం ఏపీలో మే 13 న ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. ఓట్లు వేయడానికి ఏపీ వాసులంతా పెద్ద ఎత్తున వెళ్తున్నారు. కొందరు పబ్లిక్ ట్రాన్స్ పోర్టేషన్ లలో వెళ్తున్నారు.
ఇక విమానాలలో కూడా కొందరు తమ గ్రామాలకు చేరుకుంటున్నారు. అదే విధంగా శని,ఆదివారం,సోమవారం వరుస సెలవుల నేపథ్యంలో ప్రజలంతా సొంతవూర్ల బాట పడ్డారు. తమ స్వగ్రామాలకు వెళ్లి ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ప్రయాణికుల రద్దీనిబట్టి ఇప్పటికే ఆయా మార్గాలలో అధికంగా బస్సులను ఏర్పాటు చేశారు. అయిన కూడా ప్రయాణికులు సరిపోవట్లేదంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రైవేటు ఏజెన్సీలు, ఇతర వాహానాలు అందిన కాడికి ప్రజలను దోచుకుంటున్నారు.
తమ గ్రామాలకు చేరుకోవాలని కొందరు విమానంలో కూడా వెళ్తున్నారు. దీంతో విమానయాన సంస్థలు కూడా తమ రుసుములను భారీగాపెంచేశాయి. సాధారణంగ కంటే, ఇరవై నుంచి ముప్పైరెట్లు రుసుమును అధికంగా పెంచేశాయి. ఈనేపథ్యంలోనే చాలా మంది తమ ప్రయాణాలలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
హైదరాబాద్, విజయవాడలో భారీగా వాహనాలతో ట్రాఫిక్ జాబ్ వల్ల పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. వాహానాలను క్లియర్ చేస్తు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా చర్యలు చేపట్టారు. మొత్తానికి ఈరోజు రేపు, ఇలానే కొంత ట్రాఫీక్ రద్దీ ఉంటుందని కూడా పోలీసులు చెబుతున్నారు.